లాంచ్‌కు ముందే లీకైన 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. కొత్త లుక్ ఇదే!
మరింత షార్ప్ డిజైన్, కొత్త ఫీచర్లతో రానున్న కొత్త తరం హోండా సిటీ
- ఒక వ్యాఖ్యను వ్రాయండి

Honda అభిమానులకు గుడ్‌న్యూస్. మార్కెట్లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్కు హోండా స్పందించింది. ప్రస్తుతం ఐదో తరం మోడల్‌గా విక్రయిస్తున్న Honda City సెడాన్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురానుంది. ఈ కొత్త మోడల్‌ను మే 22న అధికారికంగా విడుదల చేయనున్నారు. లాంచ్‌కు ముందే ఈ కొత్త new City ఎలాంటి ముసుగు లేకుండా బయటపడింది. లీకైన స్పై చిత్రాల ద్వారా కారుకు సంబంధించిన రిఫ్రెష్డ్ డిజైన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు బయటపడిన వివరాలు ఇవీ.
ఏమేమి కనిపించాయి?
లీకైన చిత్రాల ప్రకారం హోండా తన బెస్ట్‌సెల్లింగ్ సెడాన్‌కు పూర్తిగా కొత్త డిజైన్ లాంగ్వేజ్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముందుభాగంలో ఆధునిక లైట్‌బార్ స్టైల్ DRLs, మరింత స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్లోస్ బ్లాక్ గ్రిల్, వెర్టికల్ కట్అవుట్స్తో కూడిన స్పోర్టీ బంపర్ కనిపిస్తున్నాయి.

ప్రస్తుత మోడల్లో గ్రిల్, విండో లైన్, డోర్ సిల్స్ వద్ద క్రోమ్ ఎలిమెంట్స్ ఉండగా.. కొత్త సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో బ్లాక్డ్-అవుట్ క్రోమ్ ఎలిమెంట్స్‌ను ఉపయోగించారు. అదనంగా ముందు భాగంలో కెమెరా కూడా కనిపిస్తోంది. ఇది కొత్తగా జోడించిన 360-డిగ్రీ కెమెరా సిస్టమ్‌లో భాగమని తెలుస్తోంది.


సైడ్ నుంచి చూస్తే గత తరం హోండా సిటీ తరహా సిల్హౌట్ కొనసాగింది. పెద్ద మార్పులు కనిపించకపోయినా కొత్త స్పోర్టీ డిజైన్ అల్లాయ్ వీల్స్‌తో కారుకు మరింత ఫ్రెష్ లుక్ ఇచ్చారు.

కొత్త సిటీ వెనుక భాగంలో స్లీక్ బూట్లిడ్ స్పాయిలర్, రీడిజైన్ చేసిన బంపర్ కనిపిస్తున్నాయి. టెయిల్ల్యాంప్ ఆకారం పాత మోడల్లాగే ఉన్నప్పటికీ ఇప్పుడు ‘క్లియర్-లెన్స్ ఎఫెక్ట్’ ఇవ్వడంతో మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది.

ఇంటీరియర్
క్యాబిన్లో పెద్దగా మార్పులు లేకపోయినా మధ్యలో పెద్ద ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్‌ను అందించారు. డ్యాష్‌బోర్డ్ లేఔట్ పాత మోడల్లాగే కొనసాగింది. మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రోటరీ AC కంట్రోల్స్ యథాతథంగా ఉన్నాయి. అదనంగా కొత్త క్యాబిన్ థీమ్‌ను కూడా అందించే అవకాశం ఉంది. అయితే బ్లాక్-బేజ్ కలర్ కాంబినేషన్ మాత్రం కొనసాగనున్నట్లు ఈ లీకైన చిత్రాల ద్వారా తెలుస్తోంది.

ఫీచర్లు
ఫీచర్ల పరంగా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో అప్డేటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఇది ప్రస్తుతం ఉన్న 8-అంగుళాల యూనిట్‌కు బదులుగా రానుంది. ఇక వెంటిలేటెడ్ సీట్లు కూడా కొత్తగా జోడించారు. అలాగే వైర్లెస్ ఛార్జర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, కీ లెస్ ఎంట్రీ, ఆటో హెడ్‌ల్యాంప్స్, రియర్ AC వెంట్స్, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కొనసాగనున్నాయి.


భద్రత పరంగా 360-డిగ్రీ కెమెరా కొత్తగా జోడించారు. అదనంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, లెవల్-2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజెస్ వంటి ఫీచర్లు ఉండే అవకాశముంది.

పవర్‌ట్రెయిన్ ఎంపికలు
కొత్త సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న మోడల్లోని అదే ఇంజిన్ ఎంపికలను కొనసాగించే అవకాశం ఉంది.
| ఇంజిన్ |
1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ |
| పవర్ |
121 PS |
| టార్క్ |
145 Nm |
| ట్రాన్స్మిషన్ |
6-స్పీడ్ MT / 7-స్టెప్ CVT |
CVT -కంటిన్యూయస్ వేరియబుల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అదేవిధంగా Honda City Hybrid వెర్షన్‌కూ ఇదే అప్డేట్ వచ్చే అవకాశముంది. రెగ్యులర్ సిటీతో పాటు దాదాపు ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
లాంచ్, ధర, ప్రత్యర్థులు
కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌ను మే 22న విడుదల చేయనున్నారు. ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.12.50 లక్షల నుంచి ఉండొచ్చని అంచనా. మార్కెట్లో ఇది Hyundai Verna, Skoda Slavia, Volkswagen Virtus వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది. వీటికీ త్వరలోనే కీలక అప్డేట్లు వచ్చే అవకాశముంది.















