Hyundai Venue Knight Edition విడుదల: కాస్మటిక్ అప్డేట్స్ తో ₹9.70 లక్షల నుంచి ప్రారంభం
నైట్ ఎడిషన్‌తో పాటు, స్టాండర్డ్ వెన్యూ మోడల్‌కు కూడా రెండు కొత్త రంగులు మరియు ఒక ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ వచ్చాయి.
- ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయ్ ఇండియా వెన్యూ ఎస్‌యూవీకి నైట్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధరలు ₹9.70 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రత్యేక ఎడిషన్ HX 5, HX 6T, HX 8, HX 10 వేరియంట్ల ఆధారంగా పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్లతో పోలిస్తే ₹15,000 అదనపు ధర ఉంటుంది.
ఇక హ్యుందాయ్ కంపెనీ స్టాండర్డ్ వెన్యూ కలర్ ఆప్షన్లలో రెండు కొత్త రంగులు జోడించింది. అవి హేజెల్ బ్లూ మ్యాట్ మరియు మిస్టిక్ సఫైర్ మ్యాట్. అలాగే, వెన్యూ మరియు వెన్యూ N లైన్‌లోని కొన్ని వేరియంట్లకు ఒక కొత్త సేఫ్టీ ఫీచర్ కూడా ఇచ్చారు. పూర్తి వివరాలు మరియు అప్డేటెడ్ ధరలు క్రింద ఉన్నాయి.
2026 హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్
హ్యుందాయ్ వెన్యూ అప్డేట్ చేసిన వేరియంట్ల ధరలు ఇవి:
| వేరియంట్లు |
నైట్ ఎడిషన్ |
స్టాండర్డ్ మోడల్ |
తేడా |
| పెట్రోల్ |
|||
| HX 5 MT |
రూ. 9.70 లక్షలు |
రూ. 9.55 లక్షలు |
+రూ. 15,000 |
| HX 6T MT |
రూ. 11.03 లక్షలు |
రూ. 10.88 లక్షలు |
+రూ. 15,000 |
| టర్బో పెట్రోల్ |
|||
| HX 10 DCT |
రూ. 14.79 లక్షలు |
రూ. 14.64 లక్షలు |
+రూ. 15,000 |
| డీజిల్ |
|||
| HX 5 MT |
రూ. 11.12 లక్షలు |
రూ. 10.87 లక్షలు |
+రూ. 15,000 |
| HX 8 AT |
రూ. 13.85 లక్షలు |
రూ. 13.70 లక్షలు |
+రూ. 15,000 |
అన్నీ ఎక్స్ షోరూం ధరలు
- వెన్యూ నైట్ ఎడిషన్‌లో పూర్తిగా బ్లాక్ థీమ్ డిజైన్‌ను అందించారు. గ్రిల్, స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రైల్స్, ORVMలు మరియు అల్లాయ్ వీల్స్ అన్నీ బ్లాక్ ఫినిష్‌లో ఉంటాయి.


-
ఈ ఎడిషన్ కేవలం “టైటానియం బ్లాక్” కలర్లో మాత్రమే లభిస్తుంది. స్పోర్టీ లుక్ కోసం రెడ్ బ్రేక్ కాలిపర్స్‌ను కూడా అందించారు.

-
ఇంటీరియర్ కూడా పూర్తిగా బ్లాక్ థీమ్‌లో ఉంది. బ్లాక్ లెదర్ఎట్ సీట్లు, కాంట్రాస్ట్ బ్రాస్ కలర్ ఇన్సర్ట్స్తో ప్రత్యేక లుక్ ఇస్తుంది.


| వివరాలు: ఈ నైట్ ఎడిషన్‌లో ప్రత్యేకమైన నైట్ ఎంబ్లమ్‌ను జోడించారు, ఇది SUVకి ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తుంది. అలాగే, ముందు మరియు వెనుక భాగాల్లోని హ్యుందాయ్ లోగోలు కూడా మ్యాట్ ఫినిష్‌తో డార్క్‌గా మార్చారు. |
సేఫ్టీ అప్డేట్:
| వేరియంట్ |
కొత్త ధర |
పాత ధర |
వ్యత్యాసం |
| HX 6T MT |
రూ. 10.88 లక్షలు |
రూ. 10.80 లక్షలు |
+రూ. 8,000 |
| HX 10 DCT |
రూ. 14.64 లక్షలు |
రూ. 14.56 లక్షలు |
+రూ. 8,000 |
| HX 10 AT |
రూ. 15.64 లక్షలు |
రూ. 15.51 లక్షలు |
+రూ. 13,000 |
| N 10 DCT |
రూ. 15.48 లక్షలు |
రూ. 15.40 లక్షలు |
+రూ. 8,000 |
- వెన్యూ HX 6T, HX 10 వేరియంట్లు మరియు వెన్యూ N లైన్ టాప్-స్పెక్ N 10 వేరియంట్లో కొత్తగా డ్యాష్‌క్యామ్‌ను జోడించారు.

- ఈ అప్డేట్ కారణంగా కొన్ని వేరియంట్ల ధరలు ₹13,000 వరకు పెరిగాయి.
ఫీచర్లు మరియు సేఫ్టీ
హ్యుందాయ్ వెన్యూలో 12.3 అంగుళాల డ్యూయల్ డిస్ప్లేలు (ఇన్ఫోటైన్మెంట్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్), వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, వైర్లెస్ చార్జింగ్, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, సింగిల్ పాన్ సన్‌రూఫ్, వెనుక ఏసీ వెంట్స్ తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక విండో సన్ షేడ్స్, 4-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త డాష్ కెమెరా గురించి ప్రక్కన పెడితే ,సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS తో EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, లెవల్-2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) మరియు ఫ్రంట్-రియర్ పార్కింగ్ సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి.
ఇంజిన్ ఆప్షన్లు
వెన్యూ మోడల్లో ఈ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి:
| ఇంజిన్ |
1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ |
1-లీటర్ టర్బో-పెట్రోల్ |
1.5-లీటర్ డీజిల్ |
|---|---|---|---|
| పవర్ |
83 PS |
120 PS |
116 PS |
| టార్క్ |
114 Nm |
172 Nm |
250 Nm |
| ట్రాన్స్మిషన్ |
5-స్పీడ్ MT |
6-స్పీడ్ MT/7-స్పీడ్ DCT |
6-స్పీడ్ MT / 6-స్పీడ్ AT |
DCT - డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, AT - టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్.
వెన్యూ N లైన్ కేవలం టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ప్రత్యర్థులు
హ్యుందాయ్ వెన్యూ మార్కెట్లో టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్, స్కోడా కైలాక్, కియా సిరోస్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, టయోటా టైజర్ మరియు మారుతి ఫ్రాంక్స్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.














