• English
    • లాగిన్ / నమోదు

    Ferrari Luce భారత్‌లో ఆవిష్కరణ.. తొలి ఫెరారీ ఎలక్ట్రిక్ కారుకు 1,000 PSకు పైగా పవర్!

    ఇటీవలి కాలంలో ఫెరారీ రూపొందించిన అత్యంత భిన్నమైన డిజైన్లలో లూచే ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

    ved
    ved
    published on అక్టోబర్ 20, 2026 13:31 ist
    info icon
    published onOct 20, 2026 13:31 IST
    last updated onOct 20, 2026 13:31 IST
    1 View
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    Ferrari Luce

    ఫెరారీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును Luce పేరుతో భారత్‌లో ఆవిష్కరించింది. ఈ కారు సంస్థ ఇప్పటివరకు రూపొందించిన సాధారణ సూపర్‌కార్లకు భిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ దిగ్గజ బ్రాండ్ కార్లలో చూడని పూర్తిగా విభిన్నమైన డిజైన్ శైలిని కలిగి ఉంది. ఇది నాలుగు సీట్ల కారుగా రావడంతో పాటు, అత్యంత ఆకట్టుకునే పనితీరు గణాంకాలను కూడా అందిస్తుంది. ఫెరారీ లూచే గురించి పూర్తి వివరాలు ఇవే.

    డిజైన్

    లూచే డిజైన్ కోసం ఫెరారీ, ఆపిల్ సంస్థ మాజీ చీఫ్ డిజైన్ ఆఫీసర్ జోనీ ఐవ్‌తో కలిసి పనిచేసింది. సాధ్యమైనంత ఎక్కువ ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని సాధించడం, తద్వారా కారు గాలిని సులభంగా చీల్చుకుంటూ ముందుకు వెళ్లేలా చేయడం ఈ డిజైన్ వెనుక ప్రధాన ఉద్దేశం. ఏరోడైనమిక్ డిజైన్ వల్ల గాలి నిరోధకత తగ్గుతుంది. దీంతో కారును ముందుకు నడిపేందుకు మోటార్లపై పడే భారం కూడా తగ్గుతుంది. ఈ లక్ష్యం కారణంగానే వంపులతో కూడిన బాడీ ప్యానెల్స్‌తో, కూపే తరహా సెడాన్ ఆకారంలో ఈ కారును రూపొందించారు. ముందు భాగంలో మధ్యలో పెద్ద ఎయిర్ వెంట్తో కూడిన వంపుల బానెట్ కనిపిస్తుంది. ముందు డిజైన్‌ను కూడా మినిమలిస్టిక్ శైలిలో రూపొందించారు. గ్లోసీ బ్లాక్ ప్యానెల్‌లో సన్నని LED హెడ్‌ల్యాంపులు, DRLలను అమర్చారు.

    Ferrari Luce

    పక్కవైపు నుంచి చూస్తే, లూచే నిజమైన సూపర్‌కార్ కంటే స్పోర్టీ సెడాన్‌లా కనిపిస్తుంది. ఇందులో నాలుగు డోర్లు, వెనుకవైపు వాలుగా ఉండే కూపే తరహా రూఫ్‌లైన్ ఉన్నాయి. ముందు డోర్లపై గ్లోసీ బ్లాక్ ఇన్‌సర్ట్‌ను అందించారు. ముందు చక్రాలకు 23-అంగుళాల వీల్స్, వెనుక చక్రాలకు 24-అంగుళాల వీల్స్‌తో కూడిన స్టాగర్డ్ వీల్ సెటప్‌ను ఏర్పాటు చేశారు.\

    Ferrari Luce
    Ferrari Luce

    వెనుక భాగంలో ఇతర ఫెరారీ మోడళ్లతో అనుసంధానం కలిగించేలా గుండ్రటి LED టెయిల్‌ల్యాంపులను అందించారు. అయితే, ముందు భాగం మాదిరిగానే వెనుక డిజైన్ కూడా సంప్రదాయ స్టైలింగ్ కంటే ఏరోడైనమిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీంతో ఇది భిన్నమైన రూపాన్ని కలిగి ఉంటుంది.

    Ferrari Luce

    ఇంటీరియర్

    సాధారణ ఫెరారీ కార్ల కాక్‌పిట్‌తో పోలిస్తే లూచే ఇంటీరియర్‌లో కొత్త డిజైన్ థీమ్ కనిపిస్తుంది. ఈ కార్ల తయారీ సంస్థ నుంచి ఆశించే విధంగానే లోపలి భాగమంతా అధిక నాణ్యత కలిగిన మెటీరియల్స్‌తో రూపొందించారు. అదే సమయంలో డిజైన్ అంశాల్లో రెట్రో శైలిని గుర్తుచేసే ప్రత్యేకత కూడా ఉంది. డ్యాష్‌బోర్డ్‌పై ఒక చివరి నుంచి మరో చివరి వరకు విస్తరించిన భారీ అల్యూమినియం ఇన్‌సర్ట్‌ను అందించారు. స్టీరింగ్ వీల్ సన్నని త్రీ-స్పోక్ డిజైన్‌తో ఉంటుంది. దానిపై సిల్వర్ ఫినిషింగ్‌లు ఉన్నాయి. ఇవి ఫెరారీ గతంలో రూపొందించిన క్లాసిక్ కార్లను గుర్తుచేస్తాయి.

    Ferrari Luce

    డ్రైవర్ వైపు నుంచి ప్రయాణికుడి వైపుకు సులభంగా తిప్పగలిగే పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్‌ను కూడా ఇందులో అందించారు. అనలాగ్ డయల్స్‌ను పోలిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెనుక సీటు ప్రయాణికులకు కూడా విలాసవంతమైన సౌకర్యాలను అందించారు. క్యాబిన్‌లో విస్తృతంగా లెదర్‌ను ఉపయోగించారు. వెనుక AC వెంట్స్ కింద టచ్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా కారులోని వివిధ ఫంక్షన్లను నియంత్రించవచ్చు. Purosangue మాదిరిగా వెనుకవైపు నుంచి తెరుచుకునే డోర్లను కూడా అందించారు. ఇది కారుకు ప్రత్యేక ఆకర్షణను జోడిస్తుంది.

    Ferrari Luce
    Ferrari Luce

    ఫీచర్లు, సేఫ్టీ

    లూచే ఆధునిక కాలానికి తగిన ఫెరారీ కారు. అందుకు అనుగుణంగా సంస్థ ఇందులో అనేక ఫీచర్లను అందించింది. 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 21-స్పీకర్ల ప్రీమియం సౌండ్ సిస్టమ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు మరెన్నో సదుపాయాలను అందించారు.

    Ferrari Luce

    సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో బహుళ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఉన్నాయి. 

    పవర్‌ట్రెయిన్

    ఫెరారీ లూచేలో భారీ 112 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ప్రతి చక్రానికి ఒక ఎలక్ట్రిక్ మోటార్ చొప్పున మొత్తం నాలుగు మోటార్లు ఉంటాయి. ఇవి కలిపి 1,050 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీని పూర్తి స్పెసిఫికేషన్లు ఇవే:

    వివరాలు

    ఫెరారీ లూచే

    బ్యాటరీ ప్యాక్

    112 kWh

    ఎలక్ట్రిక్ మోటార్ల సంఖ్య

    4

    కంపెనీ పేర్కొన్న రేంజ్ (WLTP)

    530 కి.మీ.

    పవర్

    1,050 PS

    టార్క్

    990 Nm

    0–100 కి.మీ. వేగాన్ని అందుకునే సమయం

    2.5 సెకన్లు

    గరిష్ఠ వేగం

    310 కి.మీ./గంట

    మెరుగైన హ్యాండ్లింగ్ కోసం లూచేలో రియర్-వీల్ స్టీరింగ్, యాక్టివ్ సస్పెన్షన్, యాక్టివ్ టార్క్ వెక్టరింగ్ వంటి సాంకేతికతలను కూడా అందించారు. అంతేకాకుండా, 350 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.

    Ferrari Luce

    ధర, ప్రత్యర్థులు

    ఫెరారీ లూచే భారత మార్కెట్ ధరలను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఆప్షనల్ ఫీచర్లు లేకుండా దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 8.5 కోట్లుగా ఉండవచ్చని అంచనా. ఈ ధర, ప్రత్యేకమైన డిజైన్‌ను పరిగణనలోకి తీసుకుంటే లూచేకు నేరుగా పోటీ ఇచ్చే కారు ప్రస్తుతం లేదు. అయినప్పటికీ, ప్రత్యామ్నాయాలుగా Porsche Taycan Turbo, త్వరలో రానున్న Tesla Roadster వంటి ఎలక్ట్రిక్ కార్లను పరిశీలించవచ్చు.

    కార్దెకో అభిప్రాయం..

    ఈ ఏడాది ప్రారంభంలో ఆవిష్కరించినప్పుడు, ఫెరారీ లూచే సంస్థకు అత్యంత వివాదాస్పదమైన, భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన మోడల్‌గా నిలిచింది. సంప్రదాయ ఫెరారీ అభిమానులు మాత్రం పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, వంపులతో కూడిన డిజైన్, విలాసవంతమైన అనుభూతి కంటే టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఇంటీరియర్ కారణంగా ఈ కారు సంస్థ సంప్రదాయ వారసత్వ విలువలకు దూరమైందని అభిప్రాయపడుతున్నారు.

    అయితే, మరోవైపు చూస్తే ఫెరారీలో సాధారణంగా కనిపించని కొత్త డిజైన్‌ను ఈ కారు సొంతం చేసుకుంది. సానుకూలమైనా, మిశ్రమమైనా, ప్రతికూలమైనా ఈ కారు ఇప్పటికే ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. ఇంత కొత్తగా, భిన్నంగా ప్రయత్నించినందుకు ఫెరారీని అభినందించాల్సిందే!

    లూచే గురించి మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్లలో తెలియజేయండి!

    was this article helpful ?

    ved
    Ved Kulkarni is a Correspondent with CarDekho Group, and an automotive journalist with over 5 years of experience under his belt covering cars, motorcycles, mobility solutions and everything in between. A Product Design graduate, he specialises in analysing market trends, testing cars, creating automotive content and gathering customer insights. His love for vehicles began early, and he has vast hands-on experience with everything from classic cars to imported exotics and even the regular mass market vehicles. His technical expertise, combined with a deep-rooted passion for all things automotive, helps give buyers holistic and knowledgeable advice. ఇంకా చదవండి

    Write your Comment on Ferrari luce

    ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం