2026 Renault Kwid లాంచ్‌కు ముందే విడుదల.. ఇప్పటివరకు తెలిసిన వివరాలివే!
కొత్త ఫేస్‌లిఫ్ట్‌తో రానున్న రెనాల్ట్ క్విడ్ అమ్మకాల జోరును పెంచుకోగలదా?
- ఒక వ్యాఖ్యను వ్రాయండి

Renault Kwid 2015లో భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ అవతార్‌లో వచ్చే నెల ప్రారంభంలో విడుదలకు సిద్ధమవుతోంది. నవీకరించిన 2026 రెనాల్ట్ క్విడ్ ను జూలై 3న అధికారికంగా విడుదల చేయనున్నట్లు రెనాల్ట్ ఇప్పటికే ప్రకటించింది.
లాంచ్‌కు ముందే ఫేస్‌లిఫ్ట్ క్విడ్ భారత రోడ్లపై టెస్టింగ్ సందర్భంగా స్పై కెమెరాకు చిక్కింది. స్పై చిత్రాల ద్వారా తెలిసిన వివరాలు ఇవే.
డిజైన్‌లో మార్పులు
ముందు భాగం
రెనాల్ట్ క్విడ్ యూరప్‌లో విక్రయిస్తున్న డాసియా స్ప్రింగ్ ఆధారంగా రూపొందించబడింది. అందువల్ల కొత్త క్విడ్ డిజైన్, ఫీచర్లు కూడా డాసియా స్ప్రింగ్‌ను పోలి ఉండే అవకాశం ఉంది. స్పై చిత్రాలను పరిశీలిస్తే, ముందు భాగంలో కొత్త Y-ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్లు కనిపిస్తున్నాయి. ఇవి మధ్యలో రెనాల్ట్ లోగోతో కూడిన చిన్న గ్రిల్ ద్వారా అనుసంధానించబడ్డాయి. హెడ్‌ల్యాంప్‌లు ముందు బంపర్ పైభాగంలో అమర్చినట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇవి ఎల్ఈడీ యూనిట్లుగా అప్‌గ్రేడ్ అవుతాయా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

బంపర్ దిగువ భాగంలో పెద్ద బ్లాక్ క్లాడింగ్‌తో పాటు ఎయిర్ డ్యామ్‌ను అందించారు. అలాగే ప్రస్తుత మోడల్ మాదిరిగానే విండ్‌షీల్డ్‌కు ఒకే ఒక్క వైపర్‌ను కొనసాగించారు. మొత్తంగా చూస్తే ప్రస్తుత క్విడ్తో పోలిస్తే కొత్త మోడల్ డిజైన్ మరింత సింపుల్‌గా, సాఫ్ట్ లుక్‌తో కనిపిస్తోంది.
సైడ్ భాగం
సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు కనిపించలేదు. అయితే కొత్త డిజైన్ కలిగిన వీల్ కవర్లను అందించారు. అల్లాయ్ వీల్స్‌ను కూడా అందిస్తారా? లేదా? అనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు.

వీల్ ఆర్చ్‌లపై ఉన్న భారీ క్లాడింగ్ కారణంగా క్విడ్‌కు చిన్న ఎస్యూవీ తరహా రూపం లభిస్తోంది. స్పై టెస్ట్ మ్యూల్‌ను బట్టి చూస్తే C-పిల్లర్‌పై కొత్త బ్లాక్ స్టైలింగ్ ఎలిమెంట్ కూడా ఉండే అవకాశం ఉంది.
వెనుక భాగం
ప్రస్తుత క్విడ్తో పోలిస్తే కొత్త మోడల్ వెనుక భాగంలోనే ఎక్కువ మార్పులు కనిపించే అవకాశం ఉంది. ముందు డీఆర్ఎల్ల మాదిరిగానే Y-ఆకారపు టెయిల్‌ల్యాంప్‌లు అందించనున్నారు. ఇవి పరిమాణంలో పెద్దగా ఉండటంతో పాటు రివర్స్ లైట్, ఇండికేటర్ లైట్లను కూడా కలిగి ఉంటాయి.

అలాగే తొలిసారిగా వెనుక మిర్రర్ కి వాష్ ఫంక్షన్‌తో కూడిన రియర్ వైపర్‌ను కూడా అందించనున్నారు.
అంచనా ఫీచర్లు, సేఫ్టీ
మారుతి సుజుకి ఆల్టోకు ప్రత్యామ్నాయంగా బడ్జెట్ కారు కోసం చూస్తున్న వారికి రెనాల్ట్ క్విడ్ మంచి ఎంపికగా నిలిచింది. ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ మోడల్లో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్లు అందించే అవకాశం ఉంది.

అదనంగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది. యూరప్‌లో విక్రయిస్తున్న డాసియా స్ప్రింగ్ ఈవీలో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లభిస్తోంది. అయితే భారత మార్కెట్లోని క్విడ్‌లో కూడా ఈ ఫీచర్‌ను అందిస్తారా? లేదా? అనేది లాంచ్ తర్వాతే తెలుస్తుంది.
ప్రస్తుతం విక్రయిస్తున్న రెనాల్ట్ క్విడ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్ (TC), హిల్-హోల్డ్ కంట్రోల్ (HHC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కొత్త క్విడ్‌లో మరింత మెరుగైన క్రాష్ రక్షణ కోసం బలమైన ఛాసిస్‌తో పాటు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, రియర్ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లను కూడా జోడించే అవకాశం ఉంది.
పవర్‌ట్రెయిన్
ఫేస్‌లిఫ్ట్ క్విడ్‌లో ప్రస్తుతం అందిస్తున్న 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్నే కొనసాగించే అవకాశం ఉంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుత క్విడ్ సాంకేతిక వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
| ఇంజిన్ |
1-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ |
| పవర్ |
69 PS |
| టార్క్ |
92 Nm |
| ట్రాన్స్మిషన్ |
5-స్పీడ్ MT / 5-స్పీడ్ AMT |
AMT – ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ / MT – మాన్యువల్ ట్రాన్స్మిషన్
అంచనా లాంచ్, ధర, ప్రత్యర్థులు
2026 రెనాల్ట్ క్విడ్‌ను జూలై 3న అధికారికంగా విడుదల చేయనున్నారు. దీని ప్రారంభ ధర రూ.4.5 లక్షలు (ఎక్స్‌షోరూమ్) నుంచి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం విక్రయిస్తున్న క్విడ్తో పోలిస్తే దాదాపు రూ.20,000 వరకు ధర పెరిగే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో Maruti Suzuki Alto, S-Presso, ఇటీవల అప్డేట్ అయిన Tata Tiago మోడళ్లకు ఇది ప్రత్యర్థిగా నిలవనుంది.














