2026 Nissan Tekton విడుదల; డిజైన్, స్పెసిఫికేషన్లు, పవర్ట్రెయిన్లు, ధరలు తదితర పూర్తి వివరాలు
క్రెటాకు పోటీగా వచ్చిన టెక్టాన్‌ను నిస్సాన్ ‘బేబీ పట్రోల్’గా పిలుస్తోంది. అయితే నిజంగానే అలాంటిదేనా? తెలుసుకుందాం.
- ఒక వ్యాఖ్యను వ్రాయండి

నిస్సాన్ ఇండియా ఎంతోకాలంగా ఆసక్తి రేకెత్తిస్తున్న తన కొత్త ఎస్యూవీ Tekton అధికారికంగా విడుదల చేసింది. కొంతకాలంగా టీజర్ల ద్వారా ఈ మోడల్‌ను పరిచయం చేస్తూ వచ్చిన సంస్థ, ఇప్పుడు దీన్ని రూ.10.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బోల్డ్, బాక్సీ డిజైన్, భారీ ఫీచర్ల జాబితా, రెండు టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వచ్చిన ఈ ఎస్యూవీ, కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో నిస్సాన్‌కు మళ్లీ బలమైన ఉనికిని తీసుకురానుంది. టెక్టాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే:
ధరలు, వేరియంట్లు
| వేరియంట్లు |
1-లీటర్ టర్బో-పెట్రోల్ MT |
1.3-లీటర్ టర్బో-పెట్రోల్ MT |
1.3-లీటర్ టర్బో-పెట్రోల్ DCT |
| విసియా |
రూ.10.49 లక్షలు |
- |
- |
| విసియా ప్లస్ |
రూ.11.14 లక్షలు |
- |
- |
| ఎసెంటా |
రూ.11.79 లక్షలు |
- |
రూ. 14.99 లక్షలు |
| N-కనెక్టా |
రూ.13.69 లక్షలు |
రూ. 14.99 లక్షలు |
రూ. 16.49 లక్షలు |
| టెక్నా |
రూ.15.39 లక్షలు |
రూ. 16.39 లక్షలు |
రూ. 17.79 లక్షలు |
| టెక్నా ప్లస్ |
రూ.16.49 లక్షలు |
- |
రూ. 18.59 లక్షలు |
అన్ని ధరలు పరిచయ (ఇంట్రడక్టరీ) ధరలు, ఎక్స్‌షోరూమ్, పాన్-ఇండియా
- టెక్టాన్‌ను మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అవి విసియా, విసియా ప్లస్, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్.
- బేస్ 1-లీటర్ విసియా ఎంటీ వేరియంట్ ధర రూ.10.49 లక్షలు ఉండగా, టాప్-స్పెక్ టెక్నా ప్లస్ 1.3-లీటర్ డీసీటీ వేరియంట్ ధర రూ.18.59 లక్షలు (అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్).
ఈ కాంపాక్ట్ ఎస్యూవీ బుకింగ్‌లను నిస్సాన్ ప్రారంభించింది. ప్రారంభ బుకింగ్ మొత్తం రూ.11,000గా నిర్ణయించింది. డెలివరీలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
డిజైన్
- రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫామ్‌ను పంచుకున్నప్పటికీ, టెక్టాన్‌కు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని అందించేలా నిస్సాన్ సొంత డిజైన్ తత్వాన్ని అనుసరించింది.
- ముందు భాగంలో భారీ గ్రిల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది నిస్సాన్ పట్రోల్ను గుర్తు చేస్తుంది. మధ్యలో క్రోమ్ ఫినిష్‌తో నిస్సాన్ లోగో ఉండగా, గ్రిల్ వెడల్పునా ఎరుపు రంగు స్ట్రిప్‌ను ఇచ్చారు.

-
ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ భారీ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్. వీటికి C-ఆకారంలోని డీఆర్ఎల్లు, గ్రిల్ పైన కనెక్టెడ్ లైట్ బార్‌ను అందించారు.
-
ముందు బంపర్‌కు సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, మందమైన బ్లాక్ క్లాడింగ్, జత ఎల్ఈడీ ఫాగ్‌ల్యాంప్‌లతో అగ్రెసివ్ లుక్‌ను ఇచ్చారు.

-
సైడ్ ప్రొఫైల్‌లో బాక్సీ సిల్హౌట్, 18 అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, మస్క్యులర్ హాంచెస్ ఆకట్టుకుంటాయి. ముందు డోర్లపై క్రోమ్ ట్రిమ్, శుభ్రమైన లుక్ కోసం విండో వద్ద అమర్చిన వెనుక డోర్ హ్యాండిల్స్‌ను కూడా గమనించవచ్చు.

-
వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, టెయిల్‌గేట్‌పై ‘టెక్టాన్’ బ్యాడ్జింగ్, పెద్ద రూఫ్ స్పాయిలర్, బంపర్‌పై సిల్వర్ హైలైట్స్, బ్లాక్ క్లాడింగ్‌ను అందించారు.

| కొలతలు: పొడవు: 4348 మిమీ, వెడల్పు: 1815 మిమీ, ఎత్తు: 1674 మిమీ, వీల్‌బేస్: 2657 మిమీ |
కలర్ ఆప్షన్లు
నిస్సాన్ టెక్టాన్‌ను మొత్తం ఆరు రంగుల్లో అందిస్తోంది.
- పెర్ల్ వైట్
- ఒనిక్స్ బ్లాక్
- ఇండిగో బ్లూ
- ఫ్లేర్ గార్నెట్ రెడ్
- మూన్‌బో గ్రే
- బ్లేడ్ సిల్వర్
వీటిలో రెడ్, బ్లూ, గ్రే, సిల్వర్, వైట్ రంగులను ఎంపిక చేసిన వేరియంట్లలో బ్లాక్ రూఫ్‌తో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఇంటీరియర్
- టెక్టాన్ లోపల రెండు స్క్రీన్ల లేఅవుట్‌తో కూడిన లేయర్డ్ డ్యాష్‌బోర్డ్‌ను అందించారు. ప్రీమియం అనుభూతి కోసం బ్లాక్, వైట్, పర్పుల్ కలయికలో ట్రై-టోన్ క్యాబిన్ థీమ్‌ను ఉపయోగించారు.

- డ్యాష్‌బోర్డ్‌పై గోల్డ్ కలర్ ఇన్సర్ట్లు టెక్టాన్ ఇంటీరియర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

-
డస్టర్‌లో ఉన్న మూడు స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కొనసాగించినప్పటికీ, ఇందులో నిస్సాన్ లోగోతో పాటు పియానో బ్లాక్ ట్రిమ్‌ను జోడించారు.

- ఇతర అంశాల్లో క్లైమేట్ కంట్రోల్ కోసం టోగుల్ తరహా స్విచ్‌లు, ముందు, వెనుక సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లు, వెనుక ఏసీ వెంట్స్, పవర్ అడ్జస్టబుల్ ముందు సీట్లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. ఇవి క్యాబిన్‌ను మరింత విశాలంగా అనిపించేలా చేస్తాయి.
బూట్ స్పేస్
- అన్ని సీట్లు వినియోగంలో ఉన్నప్పటికీ (రూఫ్ వరకు కొలిస్తే) టెక్టాన్‌లో 700 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుందని నిస్సాన్ పేర్కొంది. రెండో వరుస సీట్లను మడిస్తే ఈ స్థలాన్ని మరింత పెంచుకోవచ్చు.


ఫీచర్లు
- టెక్టాన్ ఇప్పటివరకు నిస్సాన్ నుంచి వచ్చిన అత్యధిక ఫీచర్లతో కూడిన మోడళ్లలో ఒకటి.
- ఇందులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 6-స్పీకర్ ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్, గూగుల్ బిల్ట్-ఇన్ నావిగేషన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉన్నాయి.


-
డ్రైవర్ కోసం కస్టమైజ్ చేసుకునే లేఅవుట్‌తో కూడిన 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ డిస్ప్లేను అందించారు.
-
ఇతర ఫీచర్లలో కూలింగ్‌తో కూడిన వైర్లెస్ ఫోన్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్‌రూఫ్, 6-వే పవర్ అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ ముందు సీట్లు, ఆంబియెంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎమ్, వెనుక విండో సన్‌షేడ్స్, ఆటో హెడ్‌ల్యాంప్స్, డ్రైవింగ్ మోడ్లు, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ ఉన్నాయి.

సేఫ్టీ
టెక్టాన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), నాలుగు వీల్స్ కు డిస్క్ బ్రేక్‌లు, ముందు, వెనుక పార్కింగ్ సెన్సర్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ (HHA), రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (EPB), 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
భారత్ NCAP క్రాష్ పరీక్షల్లో ఈ ఎస్‌యూవీకి 5-స్టార్ భద్రతా రేటింగ్ లభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
పవర్ట్రెయిన్లు
సిస్టర్ మోడల్ డస్టర్ మాదిరిగానే నిస్సాన్ టెక్టాన్‌లో కూడా రెండు టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఎంపికలను అందించారు. వీటికి మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. వాటి పూర్తి స్పెసిఫికేషన్లు ఇవి:
| ఇంజిన్ |
1-లీటర్ టర్బో-పెట్రోల్ |
1.3-లీటర్ టర్బో-పెట్రోల్ |
| పవర్ |
100 PS |
163 PS |
| టార్క్ |
166 Nm |
280 Nm |
| ట్రాన్స్మిషన్ |
6-స్పీడ్ MT |
6-స్పీడ్ MT/6-స్పీడ్ DCT |
| ఇంధన సామర్థ్యం (ARAI-నిర్ధారిత) |
19.4 kmpl |
17.8 kmpl (MT)/18.5 kmpl (DCT) |
MT – మాన్యువల్ ట్రాన్స్మిషన్, DCT – డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ (ఆటోమేటిక్)

టెక్టాన్‌లో ఏ పవర్‌ట్రెయిన్ ఏ వేరియంట్లో లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ప్రత్యర్థులు
భారత మార్కెట్లో అత్యంత పోటీ ఉన్న విభాగంలో అడుగుపెట్టిన టెక్టాన్‌కు Hyundai Creta, Renault Duster, Tata Sierra, Curvv, Toyota Hyryder, MG Astor, Volkswagen Taigun, Skoda Kushaq, Maruti Grand Vitara, Victoris, Honda Elevate, Kia Seltos, Citroen Aircross వంటి ఎస్‌యూవీలు ప్రత్యర్థులుగా ఉన్నాయి.














