Toyota Innova Hycross Flex-Fuel టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కిందా? లేక ఇది ఫేస్‌లిఫ్ట్ మోడలా?
మారుతి తర్వాత భారత్‌లో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాన్ని విడుదల చేసే రెండో తయారీదారుగా టయోటా నిలవనుందా?
- ఒక వ్యాఖ్యను వ్రాయండి

టెస్టింగ్ నిర్వహిస్తున్న సమయంలో భారీ ముసుగుతో రాబోయే టయోటా Innova Hycross తాజాగా కెమెరాకు చిక్కింది. దీంతో హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో సవరించిన ఫ్రంట్ ఫాస్షియాతో పాటు ఫ్లెక్స్-ఫ్యూయల్‌కు అనుకూలమైన వేరియంట్‌ను కూడా అందించే అవకాశం ఉంది.
ఏం కనిపించింది?
స్పై చిత్రాలను పరిశీలిస్తే, మొత్తం సిల్హౌట్ ప్రస్తుత ఇన్నోవా హైక్రాస్‌ను పోలి ఉంది. అయితే ముందు భాగంలో మార్పులు కనిపించే అవకాశముంది. ఇందులో పెద్ద ఫ్రంట్ గ్రిల్‌తో పాటు బంపర్‌కు ఇరువైపులా ఉండే డీఆర్ఎల్ల హౌసింగ్‌ను స్వల్పంగా సవరించే అవకాశం ఉంది. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌ల స్థానం యథాతథంగానే కనిపిస్తున్నప్పటికీ, వాటి హౌసింగ్‌తో పాటు బంపర్ దిగువ భాగం (లోయర్ లిప్) డిజైన్‌లో కూడా మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.

హైక్రాస్ పక్క భాగం పెద్దగా మారలేదని స్పష్టంగా కనిపిస్తోంది. స్వల్పంగా బయటకు ఉబ్బిన వీల్ ఆర్చ్ క్లాడింగ్, షార్క్-ఫిన్ యాంటెన్నా, వాహనం మొత్తం పొడవునా కొనసాగే క్యారెక్టర్ లైన్స్ వంటి డిజైన్ అంశాలు యథాతథంగానే ఉన్నాయి. 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా ప్రస్తుత మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, ఈ అప్డేట్లో వాటికి కొత్త ఫినిష్ ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు.

వెనుక భాగంలో కూడా హైక్రాస్కు ఉన్న బాక్సీ, ఫ్లాట్ డిజైన్ కొనసాగుతోంది. ఇందులో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, సైడ్ ఏరో బ్లేడ్లతో కూడిన రూఫ్ స్పాయిలర్, వాష్ ఫంక్షన్‌తో కూడిన రియర్ వైపర్ ఉన్నాయి.
ఇది పూర్తిస్థాయి ఫేస్లిఫ్టా?
టయోటా శైలిని దృష్టిలో ఉంచుకుంటే ఇది పూర్తిస్థాయి ఫేస్‌లిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే 2022లో విడుదలైన హైక్రాస్కు నాలుగేళ్ల తర్వాత ఫేస్‌లిఫ్ట్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందనే చెప్పాలి. ఈ అప్డేట్లో ప్రధానంగా ఫ్లెక్స్-ఫ్యూయల్‌కు అనుకూలమైన పవర్‌ట్రెయిన్‌ను చేర్చడంపైనే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. హైక్రాస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్‌ను గతంలో మొబిలిటీ ఎక్స్పోల్లో ప్రదర్శించారు. అంతేకాకుండా, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా టయోటా తన కార్ల ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్లను సిద్ధం చేసిందని ఇటీవల వెల్లడించారు.
దేశంలో పెట్రోల్‌లో అధిక శాతం ఎథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంధనంలో గరిష్ఠంగా 85 శాతం వరకు ఎథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించగల ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను ప్రవేశపెట్టడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు.
టయోటా ఇన్నోవా హైక్రాస్: ఓవర్వ్యూ
టయోటా ఇన్నోవా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బహుముఖ వినియోగం, విశాలమైన క్యాబిన్, మన్నికైన పనితీరు కారణంగా ఇన్నోవా భారతీయ కుటుంబాల్లో విశేష ఆదరణ పొందింది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ తన స్థానాన్ని కోల్పోని కొద్ది వాహనాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

ఇన్నోవా హైక్రాస్లో పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 8-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, రెండో వరుస ఒట్టోమన్ సీట్లు, 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్లెస్ ఆపిల్ కార్‌ప్లేకు మాత్రమే మద్దతు ఇచ్చే 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌తో పాటు ఈబీడీ, లెవల్-2 ఏడీఏఎస్, ఆటో హెడ్‌ల్యాంప్స్, 360 డిగ్రీ కెమెరా, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సర్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC) వంటి ఫీచర్లు అందించబడ్డాయి.
| భద్రతలో పటిష్టమైనది: BNCAP క్రాష్ టెస్ట్‌లో ఇన్నోవా హైక్రాస్ 5 స్టార్లను సాధించిన కథనాన్ని చూడండి. |
హైక్రాస్లో రెండు ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. ఒకటి 2.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, దీనికి సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. మరొకటి 2.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, దీనికి ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌ను అందిస్తున్నారు.

ఇన్నోవా హైక్రాస్లో కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలే అందుబాటులో ఉన్నాయి.
| ఇంజిన్ |
2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ |
2-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ |
| పవర్ |
172 PS |
183 PS |
| టార్క్ |
204 Nm |
206 Nm |
| ట్రాన్స్మిషన్ |
CVT |
e-CVT |
CVT – కంటిన్యూస్లీ వేరీయబుల్ ట్రాన్స్మిషన్ (ఆటోమేటిక్)
అంచనా ధర, ప్రత్యర్థులు
ఫ్లెక్స్-ఫ్యూయల్ అప్గ్రేడ్లను దృష్టిలో ఉంచుకుని రానున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.20 లక్షల నుంచి ఉండే అవకాశం ఉంది.

ఇన్నోవా హైక్రాస్కు పోటీగా దాని బ్యాడ్జ్ ఇంజినీర్డ్ సిబ్లింగ్ అయిన Maruti Suzuki Invicto ఉంది. అలాగే ఈ ధర విభాగంలో Mahindra 7XO, Tata Safari, Jeep Meridian మోడళ్లను ఎస్యూవీ ప్రత్యామ్నాయాలుగా కూడా పరిగణించవచ్చు.














