• English
    • లాగిన్ / నమోదు

    కొత్త లుక్‌లో రానున్న Kia Sonet.. తొలిసారి టెస్టింగ్‌లో కనిపించిన నెక్స్ట్ జనరేషన్ మోడల్

    కియా సోనెట్ ప్రధానంగా పునఃరూపకల్పన చేయబడింది మరియు పవర్‌ట్రెయిన్‌లో కూడా ఒక పెద్ద అప్‌డేట్‌ను పొందవచ్చు.

    bikramjit
    bikramjit
    published on మే 13, 2026 21:56 ist
    info icon
    published onMay 13, 2026 21:56 IST
    last updated onMay 13, 2026 21:56 IST
    84 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    కియా సోనెట్ ప్రధానంగా పునఃరూపకల్పన చేయబడింది మరియు పవర్‌ట్రెయిన్‌ లో కూడా ఒక పెద్ద అప్‌డేట్‌ను పొందవచ్చు.

    Kia Sonet

    Kia Sonet రెండో తరం మోడల్ తొలిసారి టెస్టింగ్ సందర్భంగా కెమెరాకు చిక్కింది. భారీ ముసుగుతో కనిపించిన ఈ ప్రోటోటైప్‌లో పూర్తిస్థాయి డిజైన్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీని డిజైన్ ఇప్పుడు పెద్ద సోదర మోడల్ అయిన Kia Seltosకు మరింత దగ్గరగా ఉండనుంది. కొత్త Sonetలో Syrosతో పంచుకునే కొత్త K1 ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. దీని వల్ల మెరుగైన భద్రతతో పాటు మరిన్ని ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి రావొచ్చు.

    మేము స్పైషాట్‌ల యొక్క సవివరమైన విశ్లేషణను క్రింద ఇచ్చాము:

    ఏమేం కనిపించాయి?

    టెస్టింగ్‌లో కనిపించిన కొత్త తరం Sonet ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న మోడల్‌తో పోలిస్తే మరింత బోల్డ్‌గా కనిపిస్తోంది. అలాగే Kia తాజా డిజైన్ లాంగ్వేజ్ ను అనుసరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

    Kia Sonet

    ముందు భాగం మరింత వెడల్పుగా, ఎత్తుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న చిన్న Tiger Nose గ్రిల్ స్థానంలో పెద్ద, చతురస్రాకార గ్రిల్‌ను అందించినట్లు తెలుస్తోంది. సన్నని లైటింగ్ ఎలిమెంట్స్ ఆధారంగా కొత్త స్ప్లిట్ హెడ్ లాంప్ సెటప్ వచ్చే అవకాశం ఉంది. పై భాగంలో స్లీక్ LED DRLs, దిగువ బంపర్‌లో ప్రధాన హెడ్‌ల్యాంప్స్ ఉండొచ్చు.

    ముందు బంపర్‌ను కూడా మరింత మస్క్యులర్‌గా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. కొత్త Sonet సైడ్ ప్రొఫైల్ మునుపటి కంటే మరింత బాక్సీగా కనిపిస్తోంది. స్ట్రెయిట్ రూఫ్‌లైన్, పెద్ద విండోలు కారణంగా వెనుక ప్రయాణికులకు మెరుగైన హెడ్‌రూమ్ లభించే అవకాశం ఉంది.  

    Kia Sonet

    అలాగే కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను కూడా అందించారు. ఇవి మరింత క్లీనర్, ఆధునిక డిజైన్‌తో కనిపిస్తున్నాయి. టెస్ట్ మ్యూల్ వెనుక భాగం పూర్తిగా కనిపించకపోయినా, ఫ్లాట్ ప్రొఫైల్‌తో పాటు కొత్త లైటింగ్ ఎలిమెంట్స్ వచ్చే అవకాశముంది.

    Kia Sonet dashboard

    *ఈ చిత్రం సూచన కోసం ప్రస్తుత కియా సోనెట్‌కు సంబంధించినది

    ప్రస్తుతం ఇంటీరియర్ స్పష్టంగా కనిపించలేదు. అయితే ఇందులో పూర్తిస్థాయి మార్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త క్యాబిన్ థీమ్‌తో పాటు పెద్ద 12.3-అంగుళాల డిస్‌ప్లేలు (టాప్ వేరియంట్లలో) వచ్చే అవకాశముంది. ప్రస్తుతం Sonetలో: 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆపిల్ కార్ ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 7-స్పీకర్ Bose సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్‌తో కీ-లెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    కొత్త తరం మోడల్‌లో ఇవి మరింత అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది. భద్రత పరంగా ప్రస్తుతం ఉన్న ఫీచర్లను కొనసాగించే అవకాశం ఉంది. వాటిలో: 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, ABS తో EBD, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC),  టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం Level-1 ADAS ఉన్నప్పటికీ, కొత్త మోడల్‌లో మరింత అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

    ఇంజిన్ ఆప్షన్లు (Powertrain Options)

    కొత్త తరం Kia Sonetలో ప్రస్తుతం ఉన్న ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లనే కొనసాగించే అవకాశం ఉంది.

    ఇంజిన్

    1.2-లీటర్ నాలుగు-సిలిండర్ NA పెట్రోల్

    1-లీటర్ మూడు-సిలిండర్ టర్బో-పెట్రోల్

    1.5-లీటర్ నాలుగు-సిలిండర్ల డీజిల్

    పవర్

    83 PS

    120 PS

    116 PS

    టార్క్

    115 Nm

    172 Nm

    250 Nm

    ట్రాన్స్‌మిషన్

    5-స్పీడ్ MT

    6-స్పీడ్ iMT/ 7-స్పీడ్ DCT

    6-స్పీడ్ MT/ 6-స్పీడ్ AT

    iMT – క్లచ్‌లెస్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, DCT – డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్, AT – టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్.

    స్ట్రాంగ్ హైబ్రిడ్ రాబోతోంది:

    కియా సంస్థ, కియా సోనెట్ యొక్క స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది మార్కెట్లోకి వస్తే, 4-మీటర్ల లోపు సెగ్మెంట్‌లోని మొట్టమొదటి స్ట్రాంగ్-హైబ్రిడ్ SUVలలో ఇది ఒకటి కావచ్చు.

    అంచనా ధర & ప్రత్యర్థులు

    ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న Kia Sonet ధర రూ. 7.30 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. కొత్త తరం మోడల్ ప్రస్తుత మోడల్ కంటే కొంత ప్రీమియంతో వచ్చే అవకాశం ఉంది. దీన్ని 2027లో విడుదల చేసే అవకాశముంది. ఈ SUVకు ప్రధాన ప్రత్యర్థులుగా Hyundai Venue, Maruti Brezza, Tata Nexon, Mahindra XUV 3XO, Maruti Fronx, Toyota Taisor మరియు Skoda Kylaq ఉన్నాయి.

    ఇమేజ్ మూలం

    was this article helpful ?

    bikramjit
    Bikramjit Hati is a Correspondent at the CarDekho Group and a content creator with over 5 years of experience in digital media and storytelling. Passionate about automobiles, filmmaking, and storytelling, he enjoys testing cars, writing features, covering the latest industry developments, and creating content that helps buyers make informed decisions. A graduate in English, Bikramjit brings strong editorial fundamentals and a creator\'s perspective to automotive journalism. At CarDekho, he specialises in covering daily industry news, reviewing cars, analysing market trends, and turning complex automotive topics into simple, engaging stories for readers. His love for cars is matched by his passion for telling stories that connect with people beyond brochure specifications and numbers. ఇంకా చదవండి

    Write your Comment on Kia సోనేట్

    1 వ్యాఖ్య
    1
    U
    udumula venkata narayana
    Oct 27, 2026, 9:34:44 PM

    It is better of the best car with specifications and safety features sunshade curtains very useful in hot summer days. 60:40 rear seat folding. sunroof model is waste in hot weather country.

      సమాధానం
      Write a Reply

      సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

      ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

      • రాబోయేవి
      • పాపులర్
      *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
      ×
      మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం