Mahindra XEV 9S, XEV 9eలతో పాటు వాటి అన్ని వేరియంట్లకు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ధరల విస్తరణ
మహీంద్రా బోర్న్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కొనుగోలు చేయడం ఇక సులభం.. అయితే దీర్ఘకాలంలో పెరిగే యాజమాన్య ఖర్చులు అవసరమేనా?
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
EVలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో EVల వాటా 5 శాతంగా ఉంది. అయితే భారత ఆటోమొబైల్ మార్కెట్ పరిమాణం భారీగా ఉండటంతో ఇది గణనీయమైన సంఖ్యలో అమ్మకాలను సూచిస్తుంది. EV సెగ్మెంట్‌లో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న మహీంద్రా.. ఇప్పుడు మరిన్ని మోడళ్లు, వేరియంట్లకు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ మోడల్‌ను విస్తరించింది.
ఇప్పుడు అన్ని వేరియంట్లలో Mahindra XEV 9S, XEV 9eలకు BaaS మోడల్ అందుబాటులో ఉంది. ఇటీవల అప్‌డేట్ అయిన BE 6 SPORTEQకు కూడా ఈ కొనుగోలు విధానం వర్తిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం:
BE 6 SPORTEQ కోసం BaaS ధరలు:
| వేరియంట్ |
59 kWh (BaaS) |
70 kWh (BaaS) |
79 kWh (BaaS) |
| ONE |
రూ.11.45 లక్షలు |
- |
- |
| TWO |
రూ.12.95 లక్షలు |
- |
- |
| THREE |
రూ.13.95 లక్షలు |
రూ.13.95 లక్షలు |
- |
| THREE Plus |
- |
రూ.14.95 లక్షలు |
రూ.14.95 లక్షలు |
| FOUR |
- |
- |
రూ.16.95 లక్షలు |
| LAUNCH EDITION |
- |
- |
రూ.16.95 లక్షలు |
| FE |
- |
- |
రూ.14.45 లక్షలు |
| FE FOUR |
- |
- |
రూ.16.95 లక్షలు |
XEV 9S కోసం BaaS ధరలు:
| వేరియంట్ |
59 kWh (BaaS) |
70 kWh (BaaS) |
79 kWh (BaaS) |
| ONE ABOVE |
రూ.12.65 లక్షలు |
- |
రూ.12.65 లక్షలు |
| TWO ABOVE |
- |
రూ.16.05 లక్షలు |
రూ.15.95 లక్షలు |
| THREE |
- |
- |
రూ.17.85 లక్షలు |
| THREE ABOVE |
- |
- |
రూ.19.95 లక్షలు |
XEV 9e కోసం BaaS ధరలు:
| వేరియంట్ |
59 kWh (BaaS) |
79 kWh (BaaS) |
| ONE |
రూ.13.90 లక్షలు |
- |
| TWO |
- |
రూ.16.50 లక్షలు |
| THREE CINELUXE |
- |
రూ.19.35 లక్షలు |
| THREE |
- |
రూ.20.50 లక్షలు |
అన్ని ధరలకు కిలోమీటరుకు రూ.3.75 చొప్పున ఛార్జ్ ఉంటుంది. బ్యాటరీ ధరను వాయిదాల రూపంలో చెల్లిస్తారు కాబట్టి ప్రారంభంలో చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. అయితే నెలవారీ చెల్లింపులతో పాటు వినియోగించిన కిలోమీటర్ల ఆధారంగా చెల్లించే మొత్తం కూడా పెరుగుతుంది.
ధర & ప్రత్యర్థులు
మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను BaaS వాయిదాలు లేకుండా కొనుగోలు చేయాలనుకుంటే.. BE 6 SPORTEQ ధర రూ.19.45 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. మహీంద్రా XEV 9S ధర రూ.20.65 లక్షల నుంచి, XEV 9e ధర రూ.21.90 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.
ఈ మహీంద్రా మోడళ్లు Tata Harrier EV, Tata Sierra EV, Tata Curvv EV, Hyundai Creta Electric, BYD Atto 3, MG ZS EV వంటి ప్రత్యర్థులతో పోటీపడతాయి.
కార్దెకో ఏమి చెబుతోంది..
మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు తమ విభిన్నమైన డిజైన్, అధునాతన టెక్నాలజీతో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. EV టెక్నాలజీ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ.. కొత్తదనం, సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉండే రన్నింగ్ కాస్ట్ కారణంగా మార్కెట్ వీటిని ఆదరిస్తోంది. BaaS ధరల విధానం EV కొనుగోలుపై ప్రారంభ ఆర్థిక భారాన్ని మరింత తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా తక్కువ ప్రారంభ ధర కారణంగా EV కొనుగోలు చేయాలనుకుంటున్న చాలామందికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారుతుంది.
BaaS ధరల విధానం మీకు ఎలా అనిపించింది? మీరు BaaS విధానంలో EV కొనుగోలు చేశారా? మీ అభిప్రాయాలను కామెంట్లలో మాకు తెలియజేయండి.














