• English
    • లాగిన్ / నమోదు

    హ్యుందాయ్ కొత్త మొబిలిటీ సొల్యూషన్స్ ను అభివృద్ధి చేయటానికి రెవ్ తో చేతులు కలిపింది

    దక్షిణ కొరియా వాహన కారు తయారీదారులు, రెవ్ యొక్క కారు భాగస్వామ్య సేవ కోసం తన కార్లను సరఫరా చేస్తుంది

    khan mohd.
    khan mohd.
    published on ఏప్రిల్ 22, 2019 10:22 ist
    info icon
    published onApr 22, 2019 10:22 IST
    last updated onApr 22, 2019 10:22 IST
    33 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    Hyundai Join Hands With Revv To Develop New Mobility Solutions

    హ్యుందాయ్ ఇండియా, భారతీయ కారు భాగస్వామ్య విఫణిలో తన అదృష్టాన్ని పరీక్షించడానికి రివ్, కార్ షేరింగ్ కంపెనీతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో, భవిష్యత్ చలనశీలత కోసం కొత్త మరియు వినూత్న పరిష్కారాలను పరిచయం చేయడమేకుండా హ్యుందాయ్ తన వాహనాలను పంపిణీ చేస్తుంది. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న కారు భాగస్వామ్య విఫణిలో పెట్టుబడి పెట్టడానికి మొట్టమొదటి ఆటో తయారీదారులలో ఈ హ్యుందాయ్ జాయింట్ వెంచర్ తో ఒకటిగా నిలచింది.

    రెవ్ సంస్థే కాకుండా- జూమ్ కార్, ఎవిస్ మరియు మై ఛాయిజ్ వంటి ఇతర అద్దె కారు కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. ఏప్రిల్ మొదట్లో, మహీంద్రా సంస్థ కొన్ని ఎంపిక నగరాల్లో మాత్రమే దాని ఎలక్ట్రిక్ వాహనాలను (మహీంద్రా ఈ2O) సరఫరా చేయడానికి జూమ్ కార్ తో జత కట్టారు.

    హ్యుందాయ్ -రెవ్ ఉమ్మడి వెంచర్ యొక్క అధికారిక ప్రకటన ఇక్కడ ఇవ్వబడింది:

    ప్రెస్ రిలీజ్

    హ్యుందాయ్ మోటార్, రెవ్ తో వ్యూహాత్మక పెట్టుబడి ద్వారా భారతదేశంలో మొబిలిటీ సర్వీస్ విస్తరిస్తుంది

    • హ్యుందాయ్ మోటార్, భారతీయ కారు భాగస్వామ్య విఫణిలో మొట్టమొదటి స్థానాన్ని పొందుతుంది

    • హ్యుందాయ్ మోటార్ మరియు రెవ్ లు రెండూ, కారు భాగస్వామ్య ఉత్పత్తులు, కొత్త చలనశీలత సేవ వేదికల కలిసి పని చేయనున్నాయి,

    • రెవ్ భారతదేశం యొక్క అత్యంత వేగంగా పెరుగుతున్న స్వీయ డ్రైవ్ కారు భాగస్వామ్య సంస్థ

    సియోల్, ఆగష్టు 20, 2018 - హ్యుందాయ్ మోటార్ కంపెనీ, దక్షిణ కొరియా యొక్క అతిపెద్ద వాహన తయారీ సంస్థ, భారతదేశంలో సృజనాత్మక విక్రయ కార్యకలాపాలను అభివృద్ధి చేయటానికి మరియు వినూత్నమైన కారు భాగస్వామ్య సేవను అభివృద్ధి చేయడానికి భారతదేశం యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న స్వీయ- డ్రైవ్ కారు భాగస్వామ్య సంస్థ రెవ్ తో ఒక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. హ్యుందాయ్ మోటార్ పెట్టుబడితో సహా వ్యూహాత్మక భాగస్వామ్యాలు రెవ్ కు పెట్టుబడి పెట్టడం అనేది భవిష్యత్తులో చలనశీలత సేవలను భారత మొబిలిటీ మార్కెట్లో సంస్థ యొక్క మొట్టమొదటి స్థానానికి గురి చేస్తుంది.

    హ్యుందాయ్ మోటార్ మరియు రెవ్ ల, వ్యూహాత్మక పెట్టుబడులు మరియు భాగస్వామ్యం, భారతదేశంలో భవిష్యత్తు చలనశీల మార్కెట్ కు దారితీసి, సమర్థత మరియు సాంకేతిక అవసరం కోసం నిర్మించడానికి అనుమతిస్తాయి; 2016లో 900 మిలియన్ డాలర్ల నుండి 2018 నాటికి 1.5 బిలియన్ డాలర్ల వరకు వృద్ధి చెందుతుంది. 2020 నాటికి 2 బిలియన్ డాలర్ల వరకు విస్తరించవచ్చునని అంచనా వేయబడింది. 2020 నాటికి భారతదేశంలో 15,000 కార్ల రవాణా వాహనాలు 50,000 వరకు పెరగవచ్చని అంచనా

    అంతేకాకుండా, కార్ల భాగస్వామ్య సేవలను భారీగా వినియోగిస్తున్న మిల్లినియర్స్, భారతదేశపు మొత్తం జనాభాలో 35 శాతంగా ఉన్నారు. మొబిలిటీ సేవల మార్కెట్ అభివృద్ధి సామర్ధ్యం, ఇతర ప్రపంచ మార్కెట్ కంటే దృఢంగా ఉంది.

    "హ్యుందాయ్ మోటార్ ఇండియా, భారతదేశంలో అత్యుత్తమ ప్రదర్శనతో ఒక బలమైన మార్కెట్ నాయకుడిగా వేగంగా అభివృద్ధి చెందుతోందని" హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ యంగ్ కీ కూ అన్నారు. "మేము భవిష్యత్తులో మొబిలిటీ లోకి మా వ్యాపారాన్ని ముందుకు విస్తరించేందుకు రెవ్ తో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాము. హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఓపెన్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ మరియు భారతదేశం యొక్క అత్యంత వేగంగా పెరుగుతున్న స్వీయ-డ్రైవ్ కార్ షేరింగ్ కంపెనీ, రెవ్ రెండింటిలో ప్రముఖ వ్యవస్థను నిర్మిస్తుంది.

    రెవ్ యొక్క పెట్టుబడిదారులలో ఏకైక ఆటోమోటివ్ కంపెనీ అయిన హ్యుందాయ్ మోటార్, రెవ్ యొక్క కారు భాగస్వామ్య సేవకు మద్దతు ఇవ్వడానికి మార్గాలను విశ్లేషిస్తుంది, ఇందులో కారు షేరింగ్ ఉత్పత్తుల సరఫరా, కొత్త మొబిలిటీ సేవ వేదికల అభివృద్ధి మరియు ఉత్పత్తి మార్కెటింగ్ వంటివి ఉన్నాయి. ఇది భారతీయ వినియోగదారులకు హ్యుందాయ్ మోటార్ వాహనాలను విభిన్న మార్గాల్లో అనుభవించడానికి అనుమతిస్తుంది.

    "మొబిలిటీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గణనీయ మార్పు ద్వారా కొనసాగుతోంది, కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందు ముందు రాబోతుంది. ఈ షిఫ్ట్ అర్ధవంతంగా రూపకల్పన చేసే వినూత్న పరిష్కారాలను సృష్టించే ముందంజలో ఉండాలని మేము కోరుకుంటున్నాం, హ్యుందాయ్ మోటార్ ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తుందని "రెవ్ వద్ద సహ వ్యవస్థాపకుడు అనుపమ్ అగర్వాల్ అన్నారు. "హ్యుందాయ్ మోటార్ భారతదేశం లో ఒక ఇంటిపేరు మరియు వారు మా ప్రయాణంలో భాగస్వామ్యాన్ని పంచుకోవడం మమ్మల్ని ఆనందపరిచింది అని తెలిపారు. భారతీయ వినియోగదారుల వారి లోతైన అవగాహన మరియు టెక్నాలజీ తో నడిచే మొబిలిటీ పరిష్కారాలపై వాటి ప్రగతిశీల వైఖరితో, ఈ భాగస్వామ్యం మార్కెట్లో అందరి దృష్టిని ఆకర్షించి మాకు లాభాలు చేకూరుస్తుందని "రెవ్ యొక్క సహ వ్యవస్థాపకుడు కరణ్ జైన్ చెప్పారు.

    హ్యుందాయ్ మోటార్ గ్లోబల్ ఎగుమతి కేంద్రంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం హెచ్ఎంఐఎల్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా పసిఫిక్ దేశాల్లో మొత్తం 88 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇది భారతదేశంలో ప్రారంభమైన నాటి నుండి ఇదే మొట్టమొదటి కారు ఎగుమతిదారుడు. చెన్నై సమీపంలో ఉన్న ప్లాంట్ - స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పూర్తీ అధునాతన ఉత్పత్తి తో అనుసంధానికరించబడింది; మరియు ఇది భారతదేశంలో ఉత్పత్తి మరియు అమ్మకాల యొక్క 20 వ వార్షికోత్సవం సందర్భంగా, ఆధునిక ఉత్పత్తి, నాణ్యత మరియు పరీక్ష సామర్థ్యాలను కలిగి ఉంది.

    హ్యుందాయ్ మోటార్ యొక్క బ్లూప్రింట్ అనేది సంస్థ వినూత్న మొబిలిటీ సేవలను అభివృద్ధి చేయడం ద్వారా నూతనంగా అభివృద్ధి చేయబడిన ఇంజిన్ను రూపొందించారు, ఇది- స్వతంత్ర డ్రైవింగ్ మరియు కృత్రిమ మేధస్సు వంటి టెక్నాలజీల కలయికతో, భాగస్వామ్య ఆర్ధికవ్యవస్థ ద్వారా ప్రజల జీవితాలను మార్చివేస్తుంది.

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రాంతాల్లో హ్యుందాయ్ మోటార్, తన మొబిలిటీ సేవలను పెంచుతోంది. ఆటోమోటివ్ పరిశ్రమలో త్వరితంగా-బదిలీ పధ్ధతిని అధిగమించడానికి వినియోగదారులకు మంచి విలువను అందించడానికి సంస్థ కట్టుబడి ఉంది.

    సిఫార్సు చేయబడినవి : 2018 హ్యుందాయ్ శాంత్రో : మొదటి అధికారిక స్కెచ్ బహిర్గతం

    మరింత చదవండి: ఎలైట్ ఐ 20 ఆన్ రోడ్ ధర

    was this article helpful ?

    khan mohd.
    <p>Holding a Bachelor's degree in Biotechnology and later a Master's degree in English Literature, Irfan always loved to play around with words. His aim is to strive hard and gain knowledge which could be then skilfully employed in the journey of life. He believes in learning new things and that's one of the reasons why he is a writer today. Additionally, he keeps an eye on what's the latest buzz on the automobile planet. Managing things and people are some of his tasks at CarDekho. With an experience of half a decade in a variety of domains, his journey to learn is still on...</p>ఇంకా చదవండి

    Write your Comment on Hyundai Elite ఐ20 2017-2020

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    • denza d9
      denza d9
      Rs.1 - 1.10 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • denza z9 జిటి
      denza z9 జిటి
      Rs.1.25 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • మహీంద్రా థార్ ఈ
      మహీంద్రా థార్ ఈ
      Rs.25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw chery icar v23
      jsw chery icar v23
      Rs.20 - 25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw jaecoo j5 ఈవి
      jsw jaecoo j5 ఈవి
      Rs.20 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం