• English
    • లాగిన్ / నమోదు

    ఆగస్ట్ 7 న విడుదలకు ముందే బహిర్గతమైన Tata Curvv EV ఇంటీరియర్ చిత్రాలు

    కర్వ్ EV యొక్క క్యాబిన్ డ్యూయల్-డిజిటల్ డిస్‌ప్లే సెటప్‌తో సహా నెక్సాన్ EV, హారియర్ మరియు సఫారిల వంటి అనేక అంశాలు పొందుతుందని ఇటీవల విడుదలైన ఇంటీరియర్ చిత్రాల ద్వారా ధృవీకరించబడింది.

    samarth
    samarth
    published on ఆగష్టు 06, 2024 14:48 ist
    info icon
    published onAug 06, 2024 14:48 IST
    last updated onAug 06, 2024 14:48 IST
    63 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    Tata Curvv EV Interior Teased Again

    • టాటా కర్వ్ EV యొక్క టీజర్లో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్ మరియు ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు కనిపిస్తాయి.

    • ఇది 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో అందించబడుతుంది.

    • కర్వ్ EV రెండు బ్యాటరీ ప్యాక్‌ ఎంపికలలో అందించబడుతుంది, పూర్తి ఛార్జ్‌పై దాని పరిధి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

    • దీని ధర రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

    టాటా మోటార్స్ ఆగస్టు 7న భారతదేశంలో టాటా కర్వ్ EVని విడుదల చేయనుంది. దీని ఎక్ట్సీరియర్ ఇప్పటికే ఆవిష్కరించబడింది, ఇప్పుడు కంపెనీ ఇప్పుడు దాని ఇంటీరియర్ యొక్క మరిన్ని వివరాలను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకుంది. తాజా చిత్రాలు క్యాబిన్ థీమ్‌ను మాత్రమే కాకుండా కర్వ్ లో ఉండే కొన్ని ప్రీమియం ఫీచర్లను కూడా వెల్లడించాయి. రాబోయే టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారులో అందుబాటులో ఉండే ఫీచర్ల గురించి మరింత తెలుసుకోండి:

    టీజర్‌లో ఏం కనిపించింది?

    Tata Curvv EV Dashboard

    నెక్సాన్ EV డ్యాష్బోర్డుతో పోలికను చూపిస్తూ, కొంతకాలం క్రితం ఇంటీరియర్ గురించి మొదటి గ్లింప్స్ వచ్చినప్పటికీ, తాజా చిత్రాలు దాని క్యాబిన్ యొక్క స్పష్టమైన వీక్షణను అందిస్తాయి. దీని అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ పనోరమిక్ సన్‌రూఫ్, దాని తర్వాత డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లే. డ్యాష్‌బోర్డ్‌లో డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ సెటప్ అందించబడింది, ఇందులో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మరియు 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉండవచ్చు.

    Tata Curvv Ventilated Seats

    ఇది కాకుండా, డ్యూయల్-టోన్ క్యాబిన్ థీమ్ మరియు AC వెంట్స్, సెంటర్ కన్సోల్, గేర్ షిఫ్టర్, టచ్ బేస్డ్ ఆటోమేటిక్ AC కంట్రోల్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ మరియు డ్రైవ్ మోడ్ సెలెక్టర్ వంటి ఫీచర్లు కూడా కనిపించాయి, ఈ ఫీచర్లన్నీ కూడా నెక్సాన్ EV నుండి తీసుకున్నవిగా కనిపిస్తాయి. ఇవి కాకుండా, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు మరియు పుష్ బటన్ స్టార్ట్-స్టాప్ ఫీచర్ వంటి ఫీచర్లు కనిపించాయి. 

    Tata Curvv EV Steering Wheel

    చిత్రాలలో టాటా కర్వ్ EV యొక్క 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌ కనిపిస్తుంది, ఇది హారియర్-సఫారిలో కూడా ఇవ్వబడింది, దానిపై కంపెనీ యొక్క ప్రకాశవంతమైన లోగో ఉంది. ఇది ఈ రోజుల్లో ఆధునిక టాటా మోడళ్లలో కనిపిస్తుంది. 

    ఆశించిన ఫీచర్లు మరియు భద్రత

    పైన పేర్కొన్న ఫీచర్లతో పాటు, ప్రీమియం సౌండ్ సిస్టమ్ మరియు పవర్డ్ టెయిల్‌గేట్ కూడా అందించబడతాయి. అంతే కాకుండా ఇందులో, టాటా కర్వ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు మరియు బ్లైండ్ వ్యూ మానిటర్‌తో 360 డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉండవచ్చు. ఇది కాకుండా, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా అందించబడుతుంది, దీని కింద అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫంక్షన్‌లు అందుబాటులో ఉంటాయి.

    ఇది కూడా చూడండి: టాటా కర్వ్ వర్సెస్ టాటా కర్వ్ EV: ఎక్ట్సీరియర్ డిజైన్ పోలిక

    ఆశించిన పవర్ ట్రైన్

    టాటా ఇంకా కర్వ్ EV యొక్క బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ స్పెసిఫికేషన్‌ల గురించి సమాచారాన్ని పంచుకోలేదు, అయితే ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికను కలిగి ఉండవచ్చని మరియు పూర్తి ఛార్జ్‌పై దాని పరిధి దాదాపు 500 కిలోమీటర్లు ఉండవచ్చు. టాటా కర్వ్ EVలో V2L (వెహికల్-టు-లోడ్) మరియు V2V (వెహికల్-టు-వెహికల్) ఫంక్షనాలిటీ కూడా ఉండే అవకాశం ఉంది.

    ధర మరియు ప్రత్యర్థులు

    టాటా కర్వ్ EV ధర రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు. ఇది నేరుగా MG ZS EV, రాబోయే హ్యుందాయ్ క్రెటా EV మరియు మారుతి EVX లతో పోటీ పడుతుంది.

    అన్ని తాజా ఆటోమోటివ్ అప్‌డేట్‌ల కోసం కార్దెకో వాట్సప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి

    was this article helpful ?

    samarth
    Samarth is an auto enthusiast who loves cars and has been passionate about them since childhood. He\'s a writer, video editor, and active social butterfly with over four years of experience in creating content as a freelancer. Samarth enjoys traveling and discovering new places, which complements his love for cars and fuels his creativity. ఇంకా చదవండి

    Write your Comment on Tata కర్వ్ EV

    మరిన్ని అన్వేషించండి on టాటా కర్వ్ ఈవి

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

    • రాబోయేవి
    • denza d9
      denza d9
      Rs.1 - 1.10 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • denza z9 జిటి
      denza z9 జిటి
      Rs.1.25 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • మహీంద్రా థార్ ఈ
      మహీంద్రా థార్ ఈ
      Rs.25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw chery icar v23
      jsw chery icar v23
      Rs.20 - 25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw jaecoo j5 ఈవి
      jsw jaecoo j5 ఈవి
      Rs.20 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం