హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ యొక్క మార్కెటింగ్ మరియు సేల్స్ శాఖకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ గ్నాణేశ్వర్ సేన్ తో కారు చర్చ
చెన్నై: ఈ మధ్య కాలంలో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సరైన దిశలో వెళ్తుంది. అమేజ్ తో విజయవంతంగా ప్రారంభమైన హోండా డీజిల్ శకం, దాని యొక్క కొత్త సిటీ మోడల్ తో మరింత వేగాన్ని ఊపందుకుంది. ఇప్పుడు, ఇది హోండా జాజ్ తో భారత కార్ మార్కెట్లో నే అతిపెద్ద విభాగంలో ప్రవేశించడానికి సిద్ధంగా వుంది. రాబోయే జాజ్, బీ విభాగం మరియు ఇతర సంబంధిత విషయాల గురించి హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ యొక్క మార్కెటింగ్ మరియు సేల్స్ శాఖకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ గ్నాణేశ్వర్ సేన్ తో చిన్న చర్చ.
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
చెన్నై: ఈ మధ్య కాలంలో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సరైన దిశలో వెళ్తుంది. అమేజ్ తో విజయవంతంగా ప్రారంభమైన హోండా డీజిల్ శకం, దాని యొక్క కొత్త సిటీ మోడల్ తో మరింత వేగాన్ని ఊపందుకుంది. ఇప్పుడు, ఇది హోండా జాజ్ తో భారత కార్ మార్కెట్లో నే అతిపెద్ద విభాగంలో ప్రవేశించడానికి సిద్ధంగా వుంది. రాబోయే జాజ్, బీ + విభాగం మరియు ఇతర సంబంధిత విషయాల గురించి హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ యొక్క మార్కెటింగ్ మరియు సేల్స్ శాఖకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ గ్నాణేశ్వర్ సేన్ తో చిన్న చర్చ.

1. ఇటీవల బీ +విభాగము ఫేస్ లిఫ్ట్ లు మరియు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడంలో చాలా బిజీగా ఉంది. ఇప్పుడు దేశం లో రెండవ ఇన్నింగ్ కు సిద్ధంగా వున్న జాజ్, హోండా యొక్క ఉత్పత్తి గా ఎంత ముఖ్యమైనది?
ఆ. 3 వ తరంకు చెందిన హోండా జాజ్ ఒక అద్భుతమైన ఉత్పత్తి. ఇప్పటికే దీనిని ప్రవేశపెట్టిన ఇతర మార్కెట్లలో ఈ మోడల్ విజయవంతంగా నిలిచింది. అయితే, ఇది భారత మార్కెట్లో కూడా అదే విధంగా విజయవంతమవుతుందని మాకు చాలా నమ్మకంగా వుంది. ఈ ఉత్పత్తి యొక్క మొత్తం పరిమాణం, వివిధ నిర్ణాయకాలు మరియు భవిష్యత్తులో మార్కెట్ ఎలా రూపుదిద్దుకుంటుందో అనే అంశాలపై ఆధారపడి వుంది. కానీ ఈ ఉత్పత్తి మార్కెట్ లోకి ఖచ్చితంగా ప్రవేశిస్తుందనీ మేము నమ్ముతున్నాము.
2. బీ+ విభాగము మరియు భారత మార్కెట్లో దాని యొక్క అభివృద్ధి గురించి మీ అభిప్రాయమేంటి? ఈ విభాగంలో వున్నా ఇతర కార్లలో పోలిస్తే, హోండా జాజ్ ఎలాంటి సరికొత్త అంశాలతో వస్తుంది?
ఆ . ప్రస్తుతం, ఈ బీ+ లేదా ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగం, 2014-15 ఆర్థిక సంవత్సరాలలో మొత్తం 5,21,000 యూనిట్లతో దేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ వాహన విభాగంగా నిలుస్తుంది. కొత్త ఉత్పత్తులతో ఈ విభాగం ఇటీవల కాలంలో చాలా బిజీగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో 10% అభివృద్ధిని నమోదు చేసుకోగా, అదే సమయంలో, ఆ మరియు భ్ విభాగాల యొక్క వృద్ధి 7% మరియు 10% శాతం వరకు తగ్గింది.
3. ఒక గొప్ప కారు ఐనప్పటికీ, హోండా జాజ్ ను భారతదేశం లో మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు ఇది మంచి ఫలితాన్ని పొందలేకపొయింది. దీని యొక్క ధర మరియు డీజిల్ ఇంజిన్ లేకపోవడం వంటి అంశాలు చాలా ప్రభావం చూపించాయి. అయితే, ఈ స్థితిని మెరుగుపరిచేందుకు హోండా ఎలాంటి ప్రణాళికను అనుసరించబోతోంది?
ఆ. ప్రధానంగా, ఈ కొత్త జాజ్ ను మునుపటి జాజ్ యొక్క పనితీరు తో పోల్చి చూడటం సరి కాదు. అయితే, ఇది అదే మార్కెట్ లేదా అదే ఉత్పత్తి కాదని మనము తెలుసుకోవటం అవసరం. ముందు చెప్పిన విధంగా, ఈ సరి కొత్త జాజ్ డీజిల్ ఇంజిన్ తో మన ముందుకు రాబోతోంది. అలాగే, ఈ కొత్త ఉత్పత్తి యొక్క ధర, వివిధ బాహ్య మరియు అంతర్గత ధర నిర్ణాయకాలపై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా, మార్కెట్ అవసరాలు మరియు అది అందించగల విలువ ప్రతిపాదనల ఆధారంగా కూడా దీని యొక్క ధరను నిర్ణయించబడుతుంది.
4. హోండా జాజ్ ఎటువంటి ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో అందుబాటులోకి వస్తుంది ?
ఆ. ఈ సరి కొత్త జాజ్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది.
5. హోండా జాజ్ లో స్థానికీకరణ స్థాయి ఎలా వుంది మరియు దీనిని ఎగుమతి చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నా?
ఆ. మేము ఇప్పుడున్నటువంటి అన్ని మోడళ్ల స్థానికీకరణ స్థాయిని పెంచడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇప్పటివరకు చాలా మోడళ్లకు సుమారు 90% స్థానికీకరణ సాధించగలిగాము. అయితే, హోండా జాజ్ యొక్క ఎగుమతి అంశంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.














