BYDకు చెందిన లగ్జరీ బ్రాండ్ Denza నవంబర్ 13న భారత్‌లోకి!
భారత్‌లో అడుగుపెట్టిన కొద్దికాలానికే డెన్జా D9 లగ్జరీ MPVని విడుదల చేసే అవకాశం
- ఒక వ్యాఖ్యను వ్రాయండి

| మా అదృష్టవంతులైన 50 మంది పాఠకులకు వ్యక్తిగతంగా కారును కొనుగోలు చేసే ప్రక్రియలో సహాయం అందిస్తున్నాం. మీరు ఆటోమొబైల్ నిపుణుడితో నేరుగా మాట్లాడి, మీ సందేహాలన్నింటికీ సమాధానాలు పొందవచ్చు. ఈ ఫారమ్‌ను నింపండి. ఎంపికైన అదృష్టవంతులైన కస్టమర్లను త్వరలోనే మేము సంప్రదిస్తాం. |
చైనాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ BYD తన లగ్జరీ విభాగమైన Denzaను త్వరలో భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ లగ్జరీ బ్రాండ్ నవంబర్ 13న భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు BYD ధృవీకరించింది. డెన్జా, దాని ఉత్పత్తుల గురించి తెలుసుకోవాల్సిన వివరాలు ఇవే.
డెన్జా అంటే ఏమిటి?
మెర్సిడెస్-బెంజ్ మాతృసంస్థ అయిన డైమ్లర్, BYD కలిసి 2010లో జాయింట్ వెంచర్‌గా డెన్జాను స్థాపించాయి. అయితే, 2014 నుంచి ఈ బ్రాండ్ పూర్తిగా BYD యాజమాన్యంలోకి వచ్చి, అదే సంస్థ నిర్వహణలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ప్రీమియం, సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చే లగ్జరీ బ్రాండ్‌గా మారింది.

ప్రస్తుతం BYD విక్రయిస్తున్న కార్ల శ్రేణి కంటే డెన్జా మోడళ్లను ఉన్నత స్థానంలో ఉంచనున్నారు. తద్వారా కొనుగోలుదారులకు మరింత విలాసవంతమైన కార్లను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, టయోటాకు లెక్సస్ (Lexus), ఫోక్స్‌వ్యాగన్‌కు ఆడి (Audi) ఎలాగో.. BYDకు డెన్జా అలా అన్నమాట.
డెన్జా భారత్‌లో ఏ మోడళ్లను తీసుకురానుంది?
భారత్‌లో తన ప్రయాణాన్ని డెన్జా ప్రీమియం D9 MPVతో ప్రారంభిస్తుందని భావిస్తున్నాం. అయితే, ఈ బ్రాండ్ **Z9 GT స్టేషన్ వ్యాగన్**ను కూడా విడుదల చేయాలని యోచిస్తున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.

Z9 GT పనితీరుకు ప్రాధాన్యమిచ్చే స్టేషన్ వ్యాగన్. ఇది కేవలం 2.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మరోవైపు, D9 అనేది డ్రైవర్‌తో కూడిన కార్లను కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్న లగ్జరీ MPV. ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనం (EV), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
డెన్జా D9 గురించి మరిన్ని వివరాలు
డెన్జా D9 పెద్ద పరిమాణం కలిగిన మూడు వరుసల సీట్ల MPV. దీని పొడవు 5.2 మీటర్లకు పైగా ఉండగా, వీల్‌బేస్ 3.1 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది.

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కారును రూపొందించారు. రెండో వరుసలో కెప్టెన్ సీట్లు ఉంటాయి. వీటిలో వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లతో పాటు ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ సదుపాయాలు కూడా ఉన్నాయి. భారత్‌లో విడుదలయ్యే డెన్జా D9 మోడల్‌లోనూ పలు డిజిటల్ డిస్‌ప్లేలు, మరిన్ని సౌకర్యవంతమైన ఫీచర్లు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)తో సహా సమగ్రమైన భద్రతా ఫీచర్లు ఉండవచ్చని భావిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో డెన్జా ఈ MPVని ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వెర్షన్లలో విక్రయిస్తోంది. కొన్ని మార్కెట్లలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వెర్షన్ NEDC విధానం ప్రకారం గరిష్ఠంగా 600 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. అయితే, భారత్‌లో విడుదలయ్యే మోడల్‌కు సంబంధించిన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను ఇంకా ధృవీకరించలేదు.
భారతీయ కొనుగోలుదారులకు డెన్జా D9 ఎలాంటి ఫీచర్లను అందించవచ్చో వివరించేలా, మేము ఇప్పటికే డెన్జా D9లో ఆశించదగిన టాప్ 5 అంశాల గురించి వివరించాం.
అంచనా విడుదల సమయం, ధర
డెన్జా భారత మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టిన కొద్దికాలానికే D9 విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ లగ్జరీ MPV ఎక్స్-షోరూమ్ ధర రూ.1 కోటి కంటే ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నాం. భారత్‌లో ఇది MG M9, Toyota Vellfire మోడళ్ల మధ్య స్థానంలో నిలిచే అవకాశం ఉంది.
కార్దెకో అభిప్రాయం…
డెన్జా భారత్‌లోకి అడుగుపెట్టడం కార్ల కొనుగోలుదారులకు స్వాగతించదగిన పరిణామం. ఎందుకంటే దీనివల్ల లగ్జరీ కార్ల విభాగంలో మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా, BYD కార్లను కొనుగోలు చేయాలనుకుంటూ, మరింత విలాసవంతమైన ఫీచర్లను కోరుకునే కస్టమర్లు ఇతర బ్రాండ్ల వైపు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అదే గ్రూప్‌లోని డెన్జా ద్వారా వారి అవసరాలు తీరే అవకాశం ఉంటుంది.
ఇక డెన్జా తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు D9 సరైన మోడల్ అని మేము భావిస్తున్నాం. భారత మార్కెట్లో లగ్జరీ MPVలు ఇప్పటికే ప్రత్యేకమైన విభాగంగా ఎదిగాయి. సరైన ధరతో విడుదల చేస్తే, లగ్జరీ కార్ల తయారీ సంస్థల్లో డెన్జా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.










