రూ.18.79 లక్షలకు Tata Sierra ఈవీ విడుదల.. ధరలు, వేరియంట్లు, డిజైన్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు ఇవే!
హారియర్ ఈవీ నుంచి ఒక బ్యాటరీ ప్యాక్‌తో పాటు కొన్ని ప్రీమియం ఫీచర్లను సియెర్రా ఈవీ అందిపుచ్చుకుంది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి

2026 Tata Sierra EVని రూ.18.79 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో టాటా మోటార్స్ భారత మార్కెట్లో విడుదల చేసింది. లాంచ్‌కు ముందే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన తల్ మొరీబ్ ఇసుక దిబ్బను అధిరోహించి రికార్డు సృష్టించడం ద్వారా ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. డిజైన్ పరంగా Sierra ఐసీఈ వెర్షన్‌ను, బ్యాటరీ ప్యాక్‌లు, ఎలక్ట్రిక్ మోటార్ల పరంగా హారియర్ ఈవీని ఆధారంగా చేసుకున్న సియెర్రా ఈవీ.. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా బీఈ 6, మారుతి ఈ విటారాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూలై 15 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. సియెర్రా ఈవీ గురించి తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇవే..
ధరలు, వేరియంట్లు
టాటా సియెర్రా ఈవీ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వాటి ధరలు క్రింది విధంగా ఉన్నాయి.
| వేరియంట్ |
63 kWh RWD |
75 kWh RWD |
75 kWh AWD |
| ప్యూర్ |
రూ.18.79 లక్షలు |
— |
— |
| ప్యూర్ ఎస్ |
రూ.19.99 లక్షలు |
— |
— |
| అడ్వెంచర్ |
రూ. 20.99 లక్షలు |
రూ.22.19 లక్షలు |
— |
| ఎంపవర్డ్ |
రూ.22.79 లక్షలు |
రూ.23.79 లక్షలు |
— |
| ఎంపవర్డ్ ఎ |
— |
రూ.24.79 లక్షలు |
రూ. 25.99 లక్షలు |
అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ (చార్జర్ లేకుండా)
RWD - రియర్ వీల్ డ్రైవ్, AWD - ఆల్ వీల్ డ్రైవ్
- 7.2 కిలోవాట్ ఏసీ హోమ్ చార్జర్‌ను అదనంగా రూ.49,000 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
ఎక్స్టీరియర్
- టాటా సియెర్రా ఈవీ ముందు భాగంలో శుభ్రమైన, ఆధునిక డిజైన్‌ను అందించారు. వాహనం వెడల్పునా విస్తరించిన స్లిమ్ ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్ దీనికి ఫ్యూచరిస్టిక్ లుక్‌ను తీసుకొచ్చింది.


| సియెర్రా ICE నుండి తేడా: ప్రామాణిక సియెర్రాలో నిగనిగలాడే నలుపు రంగు గ్రిల్ ఉంటుంది, అయితే EVలో మరింత శుభ్రమైన రూపం కోసం దాని స్థానంలో మూసివేయబడిన, బాడీ రంగు ప్యానెల్‌ను అమర్చారు. |
- ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను బంపర్ దిగువ భాగంలో అమర్చారు. ముందు బంపర్‌లో బాడీ కలర్‌కు భిన్నంగా పెద్ద బ్లాక్-అవుట్ సెక్షన్‌ను ఉపయోగించారు. దీనికి సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ను జోడించి మరింత రగ్గడ్ లుక్‌ను అందించారు.

-
సైడ్ ప్రొఫైల్‌లో ఎత్తైన, బాక్సీ సిల్హౌట్‌ను కొనసాగించారు. దాదాపు ఫ్లాట్ రూఫ్‌లైన్‌తో పాటు పెద్ద సైడ్ గ్లాస్ ఏరియా ఉంది. బాడీ కలర్లో ఉన్న బీ-పిల్లర్ మినహా మిగతా పిల్లర్లను బ్లాక్-అవుట్ చేయడం వల్ల ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అలాగే సియెర్రాకు ప్రత్యేకమైన ఆల్పైన్ విండో స్టైలింగ్‌ను కూడా కొనసాగించారు.


-
సియెర్రా ఈవీలో 19 అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. వీటి డిజైన్ ఐసీఈ మోడల్లో ఉన్నదే. ముందు డోర్లపై 'Tata.ev' బ్యాడ్జింగ్‌ను అందించారు. సియెర్రా ఈవీ డిజైన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మా ఇమేజ్ గ్యాలరీలో చూడవచ్చు.


- డోర్లకు ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్‌ను ఇచ్చారు. బ్లాక్ రూఫ్ రైల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌లు, డోర్ల దిగువ భాగం చుట్టూ మందమైన బ్లాక్ క్లాడింగ్‌ను అందించారు.
| కొలతలు పొడవు: 4340 మిమీ, వెడల్పు: 1841 మిమీ, ఎత్తు: 1715 మిమీ, వీల్‌బేస్: 2730 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్: 205 మిమీ |
- వెనుక భాగంలో కూడా ముందు మాదిరిగానే క్లీన్, మినిమలిస్టిక్ డిజైన్‌ను కొనసాగించారు. వెడల్పాటి, నిటారుగా ఉండే టెయిల్‌గేట్‌ను అందించారు.

-
టెయిల్‌గేట్ వెడల్పునా స్లిమ్ ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్ ఉండి, రెండు ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను అనుసంధానిస్తుంది. దాని కింద 'Sierra.ev' బ్యాడ్జింగ్‌ను అమర్చారు.

- వెనుక బంపర్‌లో కూడా ముందు మాదిరిగానే పెద్ద బ్లాక్ సెక్షన్‌తో పాటు సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ను అందించారు.
రంగుల ఎంపికలు
సియెర్రా ఈవీలో ఐసీఈ వెర్షన్లో లేని రెండు కొత్త రంగులను కూడా అందించారు. మొత్తం ఏడు కలర్ ఆప్షన్లు ఉన్నాయి.
- నైనిటాల్ నాక్టర్న్ (హ్యారియర్ ఈవీ నుంచి)
- రిషికేశ్ రాపిడ్స్ (కొత్తది)
- బెంగాల్ రూజ్
- అండమాన్ అడ్వెంచర్
- ప్రిస్టిన్ వైట్
- కూర్గ్ క్లౌడ్
- ప్యూర్ గ్రే
| హారియర్ EV నుండి తీసుకున్న నైనిటాల్ నాక్టర్న్ రంగు ఎంపిక, సియెర్రా EVలో కేవలం ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లో మాత్రమే అందించబడుతుందని గమనించండి. మీరు వేరియంట్ల వారీగా రంగుల పంపిణీని ఇక్కడ చూడవచ్చు. |
బూట్ స్పేస్, ఫ్రంక్
- టాటా సియెర్రా ఈవీలో అన్ని సీట్లు ఉపయోగిస్తున్నప్పటికీ 622 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అదనంగా ముందు భాగంలో ఫ్రంక్ స్టోరేజ్ కూడా అందించారు. రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్లలో 55 లీటర్ల ఫ్రంక్ ఉండగా, ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లలో 35 లీటర్ల ఫ్రంక్ స్టోరేజ్ లభిస్తుంది.


ఇంటీరియర్
- టాటా సియెర్రా ఈవీ క్యాబిన్, ఐసీఈ వెర్షన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను అనుసరించింది. అయితే శుభ్రమైన, ఆధునిక డిజైన్‌తో మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

-
డ్యాష్‌బోర్డ్‌లో సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌తో పాటు విభిన్న ఫినిష్‌లను ఉపయోగించడం వల్ల క్యాబిన్‌కు ప్రీమియం ఫీల్ వచ్చింది. మూడు స్క్రీన్ల సెటప్ డ్యాష్‌బోర్డ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ వల్ల క్యాబిన్ మరింత విశాలంగా అనిపిస్తుంది.
-
నాలుగు స్పోక్ స్టీరింగ్ వీల్, ఏసీ వెంట్స్, డోర్ ఆర్మ్రెస్టులు, సెంటర్ కన్సోల్ వంటి ప్రధాన భాగాలను ఐసీఈ వెర్షన్ నుంచే తీసుకున్నారు.

- సీట్లకు భిన్నమైన డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీని అందించారు. సాధారణ సియెర్రాతో పోలిస్తే పైభాగాన్ని ముదురు రంగులో తీర్చిదిద్దారు. అన్ని సీట్లకు అడ్జస్టబుల్ హెడ్‌రెస్టులు ఉన్నాయి. డ్రైవర్ సీటుకు మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్ అడ్జస్ట్మెంట్ను అందించారు.
- క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ టచ్ సెన్సిటివ్‌గా ఉండి గ్లోస్ బ్లాక్ ఫినిష్ను కలిగి ఉంది. అయితే ఉపయోగించే సమయంలో అంత సౌకర్యవంతంగా లేకపోవడంతో పాటు ఫింగర్ ప్రింట్లు, స్క్రాచ్‌లు సులభంగా పడే అవకాశం ఉంది.
- ముందు, వెనుక ప్రయాణికులకు సెంటర్ ఆర్మ్రెస్టులు ఉన్నాయి. వెనుక సీట్లలో ప్రయాణించే వారికి రియర్ ఏసీ వెంట్స్, యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్టులు, సైడ్ విండోల కోసం మాన్యువల్ సన్‌షేడ్స్‌ను కూడా అందించారు.
ఫీచర్లు
- సియెర్రా ఈవీకి హ్యారియర్ ఈవీ నుంచి సమ్మన్ మోడ్, ఆటో పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లను అందించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకమైన V2L (వెహికిల్ టు లోడ్), V2V (వెహికిల్ టు వెహికిల్) టెక్నాలజీలను కూడా ఇందులో అందుబాటులో ఉంచారు. అదనంగా 'డ్రైవ్‌పే (DrivePay)' పేరుతో ఇన్-కార్ పేమెంట్ ఫీచర్‌ను కూడా అందించారు.
- ఐసీఈ వెర్షన్లో ఉన్న అనేక ఫీచర్లు కూడా సియెర్రా ఈవీలో కొనసాగాయి. వీటిలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల కో-ప్యాసింజర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మెమరీ ఫంక్షన్‌తో కూడిన వెంటిలేటెడ్, 6-వే పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, కో-ప్యాసింజర్ సీటుకు బాస్ మోడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ సన్‌షేడ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్ప్లే (HUD), వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఎన్ఎఫ్సీ కార్డ్ కీ, ఎయిర్ ప్యూరిఫైయర్, జెశ్చర్ కంట్రోల్‌తో పనిచేసే పవర్డ్ టెయిల్‌గేట్, 12-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

- పనితీరును మరింత మెరుగుపరిచే మల్టీ-టెర్రెయిన్ మోడ్లు, బూస్ట్ మోడ్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
సేఫ్టీ
సియెర్రా ఈవీలో లెవెల్-2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), 540-డిగ్రీ కెమెరా (బోనెట్ కింద భాగాన్ని కూడా చూపించే ట్రాన్స్పరెంట్ వ్యూ), ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ముందు, వెనుక పార్కింగ్ సెన్సర్లు వంటి భద్రతా ఫీచర్లను అందించారు.
బ్యాటరీ ప్యాక్, ప్రకటించిన రేంజ్
సియెర్రా ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉన్నాయి. వీటిలో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను హ్యారియర్ ఈవీ నుంచి తీసుకున్నారు. పూర్తి స్పెసిఫికేషన్లు క్రింది విధంగా ఉన్నాయి.
| బ్యాటరీ ప్యాక్ |
63 kWh |
75 kWh |
75 kWh |
| ఎలక్ట్రిక్ మోటార్(ల) సంఖ్య |
1 |
1 |
2 |
| క్లెయిమ్ చేయబడిన రేంజ్ (MIDC పార్ట్ 1+2) |
565 km |
665 km |
624 km |
| పవర్ |
238 PS |
209 PS |
209 PS (వెనుక మోటార్), 140 PS (ముందు మోటార్) |
| టార్క్ |
315 Nm |
315 Nm |
504 Nm |
| త్వరణం (0 నుండి 100 kmph) |
- |
- |
5.8 సెకన్లు |
| DC ఫాస్ట్ ఛార్జింగ్ సమయం (0 నుండి 80 శాతం) |
25 నిమిషాలు |
26 నిమిషాలు |
26 నిమిషాలు |
| డ్రైవ్‌ట్రెయిన్ |
రేర్ వీల్ డ్రైవ్ (RWD) |
రేర్ వీల్ డ్రైవ్ (RWD) |
ఆల్-వీల్ డ్రైవ్ (AWD) |
టాటా సియెర్రా ఈవీ 120 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీంతో బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతం వరకు సుమారు 26 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. అలాగే 7.2 కిలోవాట్ ఏసీ హోమ్ ఛార్జింగ్, 3.3 కిలోవాట్ పోర్టబుల్ ఛార్జింగ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ వేరియంట్లో ఏ బ్యాటరీ ప్యాక్, ఏ డ్రైవ్‌ట్రైన్ అందుబాటులో ఉంటుందనే పూర్తి వివరాలను మేము ప్రత్యేక కథనంలో వివరించాం.
ప్రత్యర్థులు
టాటా సియెర్రా ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలో ఆసక్తికరమైన స్థానాన్ని దక్కించుకుంది. ఇందులో లభించే ఫీచర్లు, స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే ఈ మోడల్ తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుందని చెప్పవచ్చు. ప్రధాన ప్రత్యర్థులు ఇవే...
- హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్: బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, విస్తృత ఆదరణ ఈ మోడల్‌కు ప్రధాన బలం. అంతేకాదు, 473 కిలోమీటర్ల ప్రకటిత రేంజ్‌తో ఈ సెగ్మెంట్లో అత్యంత ప్రాక్టికల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఇది ఒకటి.
- మారుతి ఈ విటారా / టయోటా ఈబెల్లా: ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు బలమైన బ్రాండ్ ఇమేజ్ను ప్రధానంగా నమ్ముకున్నాయి. ముఖ్యంగా మారుతి బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కారణంగా ఈ విటారా విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది.
- మహీంద్రా బీఈ 6: ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల గురించి మాట్లాడేటప్పుడు బీఈ 6ను విస్మరించడం కష్టం. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు మంచి పనితీరు, భారీ ఫీచర్ల జాబితా ఈ మోడల్ ప్రత్యేకతలు.
- విన్‌ఫాస్ట్ VF7: భారత మార్కెట్లో కొత్త మోడల్ అయినప్పటికీ VF7 క్రమంగా తన స్థానాన్ని బలపరుచుకుంటోంది. ఫీచర్లతో నిండిన క్యాబిన్‌తో పాటు ఆల్-వీల్ డ్రైవ్ ఎంపిక కూడా ఉండటం దీని ప్రధాన ఆకర్షణ. దీంతో ఇది కూడా సియెర్రా ఈవీకి బలమైన ప్రత్యర్థిగా నిలుస్తోంది.














